పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96


“ బాగా ఆలోచించు కొనుము. ప్రమాద మేమాత్రము జరిగినను రాష్ట్రమునకు శాశ్వతమైన కళంకము కలుగును "

" అటుకాకుండ చూచుకొన కుండిన నా సేవ యింకెందుకు ?"


" నీ యిష్టము ”

అని తుదకు రెడ్డి గారి మాటగా వేల్సు యువ రాజు గారి కంగీ కారమును తెలుపు కొనినారు.

వేల్సు యువ రాజుగారు వచ్చుటకు రెండు మూడు మాసములకు ముందునుఁడియే కొత్వాలుగారు పడిన 'పాటులు వారి యాలోచనలు, వారి ఏర్పాటులు, వారి జాగరూకత, అవన్నియు, వారికే తెలియును. అదంతయు వర్ణించుట ఒక గొప్ప గ్రంథమే యగును. నగరములోనికి వచ్చునట్టి యే క్రొత్త వారైనను వారి దృష్టిలోనికి రాకుండ పోలేదు. రహస్య పరిశోధకులగు చారుల సంఖ్యను అపారముగా పెంచినారు. అనుమానస్థుల సందరిని నెప్పటి కప్పుడే బయటికంపుచు వచ్చినారు. 'పోలీసు సిబ్బందిని ఎక్కున చేసినారు. యువ రాజు గారు వెళ్ళు రాజవీధులను ముఖ్యముగా దృష్టిలో నుంచుకొన్నారు. ప్రజల కిబ్బందులు కలుగకుండు నట్లుగా ఏర్పాటులు ముందు ముందుగానే కావించినారు. యువరాజు గారింక 10 - 15