పుట:Varavikrayamu -1921.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

వరవిక్రయము

లింగ :- సరికాని ఈ పిల్ల వాని క్రింద నా కెంత సొమ్మయిందో యెరుఁగుదువా! తృప్తిగా వారివల్ల రాఁబట్టి తృణమో కణమో నావల్లఁ దినవలెనేగాని నీ సొమ్మే పోయినట్లు నిగిడెదవేమి? పురుషోత్తమరావుగారు నాకంటెఁ బూర్వపుఁ జుట్టమా యేమిటి నీకు?

పేర : -ఆలాగన్నారు గనుక, అసలు సంగతి మనవి చేస్తాను వినండి. ఆయన కట్నంలేని సంబంధం ఖాయం చెయ్యాలని ఆలోచిస్తున్నారు. నా బలవంతం మీద మహా పెడితే రెండువేల కంటె పెట్టరు. అందుచేత మనం కొంచెం మారుత్రోవ తొక్కాలి. ఆయనతో కట్నం మాటేమీ కచ్చితంగా చెప్పక మంచిరోజు చూచి మాట్లాడే నిమిత్తం మన ఇంటికి తీసుకువస్తాను. సరిగా ఆ సమయానికి వివాహాల వీరయ్యగాడు వచ్చి, వేలం పాటలోకి దించేలాగు ఏర్పాటు చేస్తాను. ఆపాటలో పంతులుగారి కావేశం ఎక్కించి మూడువేలవరకూ పాడిస్తాను. నా కేమిస్తారో న్యాయంగా సెలవివ్వండి!

లింగ :- ముష్టి మూడువేల కోసమిన్ని ముచ్చటలా! ఆ మూడువేలలోనే నీ ముడుపా! చాలు చాలు! అథమపక్ష మైదువేలయిన లేకున్న మనకాసంబంధ మక్కఱలేదు.

పేర :- అబ్బ, లింగరాజుగారూ! అసాధ్యులు గదా! సరే, చచ్చో ముతమారో అయిదువేలూ అనిపిస్తాననుకోండి. అందులో, అయిదువందలు నావి, మిగతవి మీవి. ఇష్టమేనా?

లింగ :- అదిగో అదే పనికిరాదు! అందులో అఱకాని బొఱ్రి కాఁగూడదు. నీ యైదువందలు నీవు పయిగా రాబట్టుకొనవలసినదే.

పేర :- సరే, నా తంటాలు నేనే పడతాను. వీరయ్యగాణ్ణి పంపుతాను గాని వాడూ మీరూ ముందు కాస్త కూడబలుకుకోండి. పని జరిగాక వాడికి పదిరూపాయలు మాత్రం పారవెయ్యండి.

లింగ :- దానికేమి, తరువాత నీవో, నేనో లేదనిపింతము లెమ్ము.

పేర :- అన్నట్లు ఆభరణాల సంగతి చెప్పారు కారు. ఆభరణాల మాట చెవిన పడితేనేగాని ఆడంగులకు వేడే పుట్టదు.

లింగ :- వెఱ్రివాఁడా! మా పిల్ల కు మేము వెలితి చేసి కుందుమా? అప్పు డడావిడి పడవలసి వచ్చునని అయిదువేల రూపాయల నగలు