పుట:Thittla gnanam.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవునికి చెడును చేకూర్చునవి, కర్మనుమూట గట్టునవి కావున వాటిని దూషణలనియే చెప్పవచ్చును. జ్ఞానమునకు సంబంధించినవేవైన విషయములనుండి కడతేర్చునవి, మానవునికి శుభమును చేకూర్చునవి, కర్మలనుండి విముక్తి కల్గించునవై ఉండును. కావున వాటిని దీవెనలనియే చెప్పవచ్చును. గుణ విషయములకు సంబంధించి దీవెనలవలెనున్న దూషణలలో మరొక దానిని క్రింద చూస్తాము.

-***-


కళ్యాణ ప్రాప్తిరస్తు

మానవ జీవితములో వివాహము ఒక పెద్ద మలుపులాంటిది. ఒక విధముగ యోచిస్తే మరొక మనిషితో కలసి బ్రతుకుటకు ఒప్పందముతో కూడుకొన్న దినము వివాహము. మరొక విధముగ యోచిస్తే తన స్వేచ్చకు ఆటంకములనుకొనితెచ్చుకొను దినము వివాహము. ఇంకొక విధముగ యోచిస్తే మాయాసర్పమును తన మెడలో తగిలించుకొను మొదటిదినమే వివాహము. జీవితములో ఒడు దుడుకుల ప్రయాణమునకు ప్రారంబమే వివాహము. మనిషి ఎన్నో విషయములలో రక్తి విరక్తిని పొందుటకు అవకాశమున్న సంసార జీవితమునకు ఆరంబమే వివాహము. అజ్ఞాన జీవితమునకు నాంది పలుకుటయే వివాహము. కావున వివాహదినమున మనిషికి కావలసిన దైవసందేశములన్ని తెలిపి వానిని జాగృతపరచడము జరుగుచున్నది. వివాహమును పెళ్లి అని పిలువడము కూడ జ్ఞానసందేశమే. పెళ్లి అను పేరుపెట్టి ఆ దినము చేయు ప్రతికార్యము దైవజ్ఞానముతో సమ్మేళనమై ఉండునట్లు పూర్వము పెద్దలు తీర్చిదిద్దారు. అయినప్పటికి మాయ ప్రభావమువలన దైవజ్ఞానము తెలియకుండపోయినది, కొన్ని