పుట:Thittla gnanam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నదని, కర్మవ్రాత తెల్లటి పత్రము మీద వ్రాయబడినదని పూర్వము పెద్దలు చెప్పెడివారు. తాటి ఆకుమీద బయటి వ్రాతలు వ్రాయబడినట్లు లలాట పత్రము మీద కర్మవ్రాతలు గలవని, దానిప్రకారమే జరుగునని అనాటి జ్ఞానుల ఉద్దేశముండెడిది. కర్మవ్రాత లేకుండ పోతే దేవునియందైక్యమగుదురని చెప్పెడివారు. కర్మ వ్రాతలేకుండ పోవాలంటే కర్మ లిఖితమే కాకూడదని, కర్మలిఖితము కాకుండ ఉండవలెనంటే కర్మ వ్రాయబడు పత్రమే ఉండకూడదని ఆనాటి వారి భావము. అందువలన తమశిష్యులను దీవించునపుడు కొందరు గురువులు దీవెనగ "నీ ఆకు చినగనాని" అనెడివారు. తమ శిష్యులకు కర్మలేకుండపోయి మోక్షము లభించవలెనను ఉద్దేశముతో నీ ఆకు చినగనాని అని శుభము కల్గునట్లు చెప్పుచుండిరి. కర్మవిముక్తిగావించు అర్థములలో నీ ఆకు చినగనాని అనుమాట దీవెనలలో చేరియున్నది. నేటికది మిగత దీవెనలవలె అర్థము తెలియకుండ పోయి చివరకు తిట్లలోనికి చేరిపోయినది. కొందరు అజ్ఞానులు నీ ఆకు చినగనాని అని శాపనార్థముగ దూషించుకొనుట పల్లెప్రాంతములలో చూస్తునే ఉన్నాము.

-***-


నీ తలపండు పగల

పూర్వము జంబుకేశ్వరుడను ఒక మహర్షి ఉత్తరదేశమున హిమాలయ ప్రాంతములో నివసిస్తుండెను. ఆయన చాలా గొప్ప జ్ఞాని. యోగపురుషుడని తెలిసి అనేకమంది ఆయన వద్దకు వచ్చి కొందరు జ్ఞానమును ఆశించగ, కొందరు ప్రపంచవిషయములను అడుగుచుండిరి. ప్రపంచవిషయములకు ఏమాత్రము విలువివ్వని జంబుకేశ్వరముని జ్ఞాన జిజ్ఞాసులను తన వద్దయుంచుకొని మిగత వారిని అక్కడినుండి పంపి