పుట:Thittla gnanam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ తాడు తెగ

మనమనుకొన్న వాటిలో మరికొన్ని దీవెనలు గలవు. అందులో ఒకటి "నీ తాడు తెగనాని" అనునది. తాడు కట్టివేయుటకు పనికి వచ్చునది. తాడు బంధించునది కావున బంధము అంటున్నాము. బంధింపబడు దానిని బంధీ అంటున్నాము. ఆధ్యాత్మికము ప్రకారము కర్మ అనునది బంధనము అనుతాడుగ, జీవుడు బంధింపబడిన బంధీగా ఉన్నాడు. పాపపుణ్యములను కర్మబంధనము జీవుని బంధించి జన్మలకు పంపుచున్నది. ఎపుడైతే కర్మలేకుండపోవునో అపుడు జీవుడు మోక్షము పొందగలడు. మోక్షము అనగ విడుదల అని అర్థము. కర్మబంధనము నుండి విడుదల పొందడమునే ముక్తి, విముక్తి అంటున్నాము. జ్ఞానము తెలుసుకొనువాడు తొందరగ ముక్తి పొందవలెనని పెద్దలు దీవించు మాటను పూర్వము "నీతాడు తెగనాని" అనెడివారు. నేడు ఆ మాట యొక్క అర్థము తెలియక పోవడము వలన కోపముతో ఎవరినైన తిట్టునపుడు దూషణ "నీతాడు తెగనాని" అనడము జరుగుచున్నది. ఆనాడు దయతో పలికిన పలుకు దీవెనకాగ, నేడు కోపముతో పలుకుచున్న అదేమాట తిట్టుగ చలామణి అగుచున్నది.

-***-


నీ ఆకు చినగ

ఇదే విధముగ పూర్వము దయతో దీవించిన దీవెన మరొకటి గలదు. అదియే "నీ ఆకు చినగనాని" ఈ మాటలో పూర్వపు జ్ఞానుల ఉద్దేశమేమిటో వివరించుకొందాము. కొన్ని వేలు వందల సంవత్సరముల పూర్వము వ్రాయుటకు కాగితములులేని కాలములో ఆనాడు వ్రాతను తాటి ఆకులమీద వ్రాసెడివారు. వ్రాత అనునది ఆకులమీదనే ఉండెదని అప్పటికాలములో అందరికి తెలియును. జీవుని కర్మకూడ లిఖించబడి