పుట:Thittla gnanam.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయడమని అర్థము. మూయనాని అను పదము కాలక్రమమున మోయనాని అయినది. ముండమోయనాని అనగా వ్యభిచరించు మనస్సును అణచి వేయడమని అర్థము. చంచల మనస్సు ఎపుడు నిలచిపోవునో అపుడు బ్రహ్మయోగము లభించును. బ్రహ్మయోగము లభించవలెనన్న మనస్సు లేకుండ పోవలెను. మనస్సును అణచివేయుట చాలా కష్టమైనపని. మనోసంకల్పమును లేకుండచేసి మనుస్సును అణచి వేయడము గాలిని మూటగట్టినంత పనిగ ఉండును. ఎంతో దుర్లభమైన మనోనిలకడ కల్గుటకు ఒక గురువు శిష్యుని దీవించిన దీవెనయే 'నీవు ముండమోయనాని'. ముండ అనగ మనస్సు, మోయనాని అనగ లేకుండ చేయడమని అర్థము తీసుకొంటే, నీవు మనస్సును జయించమని దీవించడమే అగును. జ్ఞానపరముగ ముండమోయడము దీవెనైనది. ఈ మాటనే ఇంకొక విధముగ కూడ దీవెంచెడివారు. 'నీవు మూడుదోవలు కలిసే చోటముండమొయ్య' అనడము కూడ జరిగెడిది. ఇక్కడ మూడుదోవలు కలిసేచోట అనడము విశేషము. శరీరములోని మనస్సును లేకుండ చేసుకొని బ్రహ్మయోగమును పొందడము దీవెనలోని ముఖ్య ఉద్దేశము అయినందువలన మూడు దోవలు కూడ శరీరములోనే ఉండునని ఆలోచించవలసిన అవసరమున్నది. ఆ విధముగ ఆలోచిస్తే మన శరీరములో ముఖ్యమైన మూడునాడులు కలయుచోటు కలదు. ఇడ, పింగళ, సుషుమ్న అనబడు మూడు ముఖ్యమైన నాడులు శరీరములో గలవు. వీటినే సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి అను పేర్లు గల మూడునాడులుగ చెప్పుకొనుచున్నాము. ఈ మూడునాడులు తలమద్య భాగములో కలియుచున్నవి. తలలోపల కలియు మూడునాడు లను బయటికి కనిపించునట్లు ముక్కుకుపైన నుదుటి భాగమున మూడు నామములుగ తీర్చిదిద్దడము నేటికి జరుగుచున్నది. పూర్వము మూడు