పుట:Thittla gnanam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు ముండమొయ్యనాని

"నీవు ముండమొయ్యనాని" అను మాట కూడ తిట్లరూపములో నున్న దీవెనయే. పూర్వము ఈ మాట దీవెనగ చెప్పబడినది. నేడు దాని అర్థము తెలియని అజ్ఞానమనుషులు ఈ మాటనే తిట్టుగ మాట్లాడు చున్నారు. పూర్వము జ్ఞానధనమున్న గొప్ప గురువుల వద్దకుగాని, మహర్షులవద్దకుగాని సాధారణ మనుషులు పోయి, అక్కడ వారివద్ద వినయవిధేయతలు కల్గి జ్ఞానజిజ్ఞాసులై ఉన్నపుడు, వారికి జ్ఞానముకల్గి మోక్షమును పొందవలెనను మంచి ఉద్దేశముతో "నీవుముండమోయనాని" అని దీవించెడివారు. బయటి ప్రపంచములో ముండమోయడము అంటే భర్త చనిపోయినపుడు భార్యకు పసుపుకుంకుమలు, గాజులు, తాలిబొట్టు మెట్టెలు తీసి వేసిడమును ముండమోయడమని అనుచుందురు. పూర్వము జ్ఞాన సంబంధమైన అర్థముతో నీవు ముండమొయ్యనాని అనుమాటను బాహ్యార్థముతో పోల్చి చూచుకొంటే తిట్టుగనే కనిపించును. నేడు ఆ మాటను అనేవారు కూడ బయటి అర్థముతోనే అనుటవలన పూర్తి దూషణ క్రిందికి మారి పోయినది. నీవు ముండమొయ్యనాని అను ఒకే మాట జ్ఞానము ప్రకారము దీవెన అజ్ఞానము ప్రకారము తిట్టుగనున్నది. అజ్ఞానము ప్రకారము ఆడవారిని తిట్టునపుడు నీ భర్త చనిపోవలెనను అశుభమును సూచించునట్లును, మగవారిని తిట్టునపుడు నీ భార్య చనిపోవలెనను అశుభమును సూచించునట్లును, అర్థమొచ్చునట్లు నీవు ముండమొయ్యనాని అనుచున్నారు.


జ్ఞానము ప్రకారము దీవెనగా ఎట్లున్నదంటే! జగతిలో చపలత్వముగ స్త్రీని ముండ అనడము సహజము. వ్యభిచరించు స్త్రీని లంజముండ అనడము కూడ జరుగుచున్నది. శరీరములో చపలత్వము గల మనస్సును ముండతో సమానముగ పోల్చిచెప్పుచున్నాము. మూయడము అనగా కనిపించకుండ, లేకుండచేయడము. మూయనాని అనగా లేకుండ