పుట:The Verses Of Vemana (1911).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      వేరు - పురుగు చేరి, వృక్షంబు జెరుచును ;
      చీడ - పురుగు చేరి, చెట్టుఁ జెరుచు ;
      కుత్సితుండు చేరి, గుణవంతుఁ జెరుచురా. వి. 15

      ఉప్పు కప్పురంబు నొ'క్కపోలికెనుండు ;
      చూడఁ జూడ రుచుల జాడ వేరు;
      పురుషులందు పుణ్య - పురుషులు వేరయా. వి. 16

      జీవి పోక ముందె జీవ - వస్తువులి'చ్చి,
      జీవి నిలుప వలయు జీవనముగ ;
      జీవి తొలఁగు వెనక జీవ - వస్తువులే'ల ? వి. 17

      కల్ల నిజము రెండు కర - కంఠుఁడె' రుగును,
      నీరు పల్లమె' రుగు నిజముగాను :
      తనయుని జననంబు తల్లిఁదానె' రుగును. వి. 18

_________

15. The root-worm destroys the tree ; the sap.worm destroys the herb ; and the backbiter ruins every good quality.

16. Salt and camphor are of one semblance ; but if you examine and try the flavours, their tastes are diverse : thus do the excellent differ from other men.

17. Before the spirit depart give vital medicines and stay the soul in life ; but when the soul hath departed, to what end are reviving remedies ?

18. Truth and falsehood the Great Spirit alone knows : water alone truly knows the declivity and the rising ground : and the mother alone knows the generation of her son and also it his father.