పుట:Telugunaduanuand00srirsher.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

  
చ. నిరుపమబుద్ధిశాలి కరిణీకము జేసిన యూరికాపులె
ల్లరుభువిఁ బాలుబొంగినటులన్మదిబొంగుచు "దొడ్డవోడుమా
కరణముబిడ్డయింట కలకాలము మేలగు" నంచు గంగగో
లుకు; సరికానివా రతనిదొడిన మేపుదు రాలమందల౯.

చ. నడవడిమంచివ్రాతకరణంబతడెప్పుడు వ్రాయుచుండగ౯
దడదడమోగు గూతకరణం బతడన్నిటసున్న యిందరి
దడబడజేసి మేతకరణంబు గుటుక్కున మ్రింగు నెల్లరా
బడులును బెళ్ళికట్టములు బందరుపజ్జన కొన్నియూళ్ళలో౯.

చ. కరణము సంజనేల దరఖాస్తులకాలమె పంటకళ్ళ మం
చెరబడి చేయిసాప రయితెట్లనో చౌలము పావుదెచ్చి య
క్కరగడతేర్చు మంచడుగ౦గా నెకరానికి మాడమేర కం
దరునొసగంగ నీనొసటనా యుదయించెను ప్రొద్దుపొమ్మను౯.

శా. ఓరీ చాకలి కాళ్ళుగ్రుద్దుమని యెన్నోసార్లు నేబిల్వ లే
దా రావేమిర తిమ్మిరెక్కినది లేదా బుద్ధి నీచాకిరం
బేరేవోయికఁజూడునీమదము నాకెవ్వారలడ్డంబురా
తేరాద స్త్రమటండ్రు గ్రామకరణా ల్తీవ్రప్రభావంతులై.

ఉ. నమ్మిన నమ్మకున్న నది నావశమ జనులాడుకొన్నవా
క్యమ్ములు నేను జెప్పెదభ యంపడియోపడకో నియోగిలో
క మ్మనివార్య కార్య ఘట కమ్మవుగాని పరోపకార శూ
న్యమ్మనుస్వప్రయోజన పరాయణము౯ దలపోయ దిద్దర౯.

చ. ముదికరణాలు రాముగుడి మోసలరచ్చలు దీర్చి భారతాల్
జదువుచులోకవార్తల బ్రసంశలనండ్రు తెలుంగుభాష మం
చిది మనపిల్లకాయలు వచించెడి యింగిలిపీసువుస్ పుస౯
బెదవులుదాటదెంతటియె ఫేయు బియే యెమియే వచించిన౯

ఉ. ఈతరి జాతి రాచరికమింతటి దుర్గతిదెచ్చెగాని మా
తాతహయాములో నుడుగు:దాటినవారలఁ బట్టి తెచ్చి చ
ట్రాతను గట్టికొట్టి పది రాత్రు లటుంచిన రాజుతోడ వి
జ్ఞాతము సేయు వాడొకడు గల్గెనెయందురు వృద్ధలౌకికల్.

ఉ.స్నానము జేసి సంధ్య నిముసాననె దీరిచి బొట్టుబెట్టి పీ
ఠాననుగూరుచుండి యెఱడాలరివాణము జోడు చెంబులుం
దా నమరించిమంచి యరటాకునవన్నముగూరగాయలు౯
దానుభుజించు సై సినపదార్థను గొంచునియోగినిచ్చలు౯.

గీ. అడిగినదియిచ్చు త్యాగి సత్యమున నేగి
అన్ని గల్గినభోగి భార్యగల యోగి
చిలుమిడని రాగి వండనేర్చిన నియోగి
కంచుదివిటీలతోన జగాన గాను

చ. గడబిడ జేసియైన తను గట్టిగ మంత్రము సెప్ప డెప్పు డా
గడమున గట్టుసేయవలె గ్రామపురోహితునంచు తప్పక౯
గడియలు లెక్కబెట్టి సరికానిది యైనది చూచుకొందు రే
బడబడ పాట బాడినను పట్టగలేరు తెలుంగులౌకికుల్.

ఉ. యజ్ఞము సేయగావలయునన్ని టిగూర్పుడు నాఁబురోహితుల్
ప్రజ్ఞలు గొట్టి యిచ్చినవరాలను గైకొని మీరు వేదసా
రజ్ఞులు, యాజమానములు రావలెనందు రనంగ లౌకికుం
డజ్ఞులరో కొనుండు మనకవ్వియు నాలుగు బండ్లనున్వెస౯