పుట:TellakagitaM.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేలు తలపు

ఎపుడో ఒకమాటు వస్తుందో మంచి మాట స్వచ్చమైన తలపుల్లో..
స్మరించే మాటల్లో ఒకానొక మంచి
అయినా కాకున్నా అందరికీ ఆమోదం
వస్తుంది మది లోకి ఎపుడో ఒకమాటు
అందిన సాయం గుర్తుగా చేసిన మేలు తలిస్తే..ఎదురుగా
మెచ్చుకోలు అందుతుంది ప్రీతిగా.. ఎన్నడు మరువరు నిన్ను.
హాయిని గొలిపిన పిమ్మట.. అది మంచిని పంచే ప్రేరణ.
ఉపకారికి అభినందన.. రాత పూర్వకమైనా
హావభావ యుతమైనా.. ఫోను పలకరింపైనా
స్వయం మనవి చేసుకున్నా..
సాయం పొందేందుకు వారధి అది.
అభినందన అందనపుడు..
తిరిగి సాయం తలవకపోవడం సహజం
ఇది కోండకొచో గ్రహించే వివరం
సహజంగా మంచోళ్లే మనిషన్నవాడెవడైనా
సాయం చేస్తారు, చేతిని అందిస్తారు, సహకరిస్తారు
నడిపిస్తారు.. మంచి దారికి మళ్లిస్తారు
ఆ గుర్తింపుకే పెద్దెత్తున ఆనందిస్తారు
కృతజ్ఞతలు అందుకున్నా, ప్రశంసలు పొందినా
ప్రేమతో స్వీకరిస్తారు గుర్తింపుకి పరవశిస్తారు
స్వంత లాభపు ఊసుతేని; స్వార్థ పరత జాడలేని
మంచితనమే మర్మమిందులో
మన మెచ్చుకోలే లోకహితానికి ఊతం
నడుం బిగించే అవకాశాల నిచ్చెన
ఇతరుల్ని ప్రేరేపించే కారకం
జీవితాన్ని అనంతంగా తేలిక పరచుకునే
చక్కని-చిక్కని అవకాశం
(ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్- నాగేశ్వరరావు గారి మాటల మంత్రాలకు ముగ్ధుణ్నై..)