పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 அ0' స్వీయ చ రి త్ర ము ర్యాచరణమునందుఁ దగినంత యుత్సాహమును ధైర్యమును బూనికను కరుణిం చునుగాక! ఈమె కిప్పడు లోకాను భవమంతగా లేకపోయినను గాలక్రమ మున ననుభవజ్ఞురాలయి కార్యనిర్వహణమునందు సమర్థరాలగు ననుటకు సందేహముండదు. గ్ర శరణాలయమునందున్న వారందఱును నాకుఁ బుత్రికలే రైనను గుణసంపత్తిచేతను బరోపకార పరత్వముచేతను నాకీమె యీశ్వర దత్తయైన ప్రియపుత్రికయైనట్టు భావించుచున్నాను. ఈమె తండ్రియైన యోగానందము"గారు నాకు బాల్యమిత్రుఁడు; పాఠశాలయందుఁ జదువుకొను చుండి నేను * రసిక జనమనోరంజనము ” ను రచించుచుండినప్పడతఁడు దాని శుద్ధప్రతిని వ్రాసెను; మొదటి రెండు వితంతు వివాహములును జరగిన పివ్రుట శంకరాచార్య స్వాములవారి బహిష్కారపత్రికలు బయలుదేణి యెల్ల వారిని భయపెట్టి మరల వివాహములు జరగుట దుర్ఘ టవునితోcపఁజేసిన కాల ములో మూఁడవ వివాహమున కీయనయు నీయన మిత్రుఁడగు మనోహరము పంతులు గారును నాకెంతోసాయముచేసిరి. ဍဌ်၌ నా బాల్య స్నేహితుని పుత్రి కయగుటచేతఁగూడ నాకీమె మతింత యాదరణ పాత్రురాలగుచున్నది. ဍို యినా మొకు సహశియురాలయి శ్రీనుతికారుమూరి మల్లమ్మ వితంతు శరణాలయాభివృద్ధికయి పనిచేయఁబ్రతిజ్ఞ చేకొని యున్నది. ప్రస్తుత మి యిగువురను వితంతు శరణాలయ భారనిర్వహణమునకయి యీశ్వరుఁడు ప్రసాదించినట్టు తోఁచుచున్నది. ఈయిరువుర చిత్తవృత్తులును సదా సత్కార్య పగాయత్తము లగునట్లు పరమపిత ప్రసాదించునుగాక ! సత్కార్యనిర్వహణమునకిప్పడు ஆல పూనుకొనుచున్నారు గనుక కార్యము జయప్రదముగా సాగగలదని నిశ్చయముగాఁజెప్పవచ్చును. స్త్రీలు పూనుకొని తోడుపడినంగాని యే సాం ఘిక సంస్కారమును సంపూర్ణ విజయమునొందనేరదు. مارٹل పూనుకొన్న యీ మహాకార్యము సాఫల్యము నో°ందకమూనదు. శ్రీలప్రతిజ్ఞ లయందంత కంతకు నాకు విశ్వాస మెట్లు హెచ్చుచున్నదో యష్లే యిప్పడిప్పడు నాకంత కంతకు వునయావనపురుషుల ప్రతిజ్ఞ లయందు విశ్వాసము తగ్గుచున్నది, కొందఱు జట్టును బొట్లును తీసివేసినంత మాత్రముననే తాము ఘనులమైతి