పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోను నావద్దనున్న రూపాయలతోను ఇటుకలు కఱ్ఱలు మొదలయినవి సాధ్య మైనంత చౌకగా కొనుచు పనివాండ్రను బెట్టి నేనే యొద్దనుండి పనిచేయించు చుంటిని. ఈ విషయములో నా కీశ్వరసాహాయ్యము ముఖ్యముగా నను గ్రహింపఁబడినది. క్రిందటి సంవత్సర వేు నూఱు రూపాయల పుస్తకములే యవ్రుడు పోయినను పనికిఁబూనిన యీ సంవత్సరమునందు పుస్తక విక్రయము వలన వేయి రూపాయలకంటె నధికముగా వచ్చినవి; నేను కోరికయే యీ సంవత్సరమున నన్ను సర్వకలాశాలవారు పరీక్షకునిగా నియమించిరి; చెన్న రాజధానీ విద్యావిచారణకర్తగారు నన్ను మధ్యమపాఠశాలా పరీక్ష కుని-గా నేర్పఱితిచిరి. ఈశ్వర ప్రేరణముచేతఁగాక యివియన్నియు యయాచితము గా చేకూరుట యెట్లు సంభవించును? మంచి కార్యములకెల్లను దేవుఁడు తోడుపడు ననుటకు లేశమును సందేహము లేదు. ఈ ప్రకారముగా నే నెదురు చూడని ధన ప్రాప్తికలుగఁ గా," మూడువేలతో ముగింపవలె ననుకొన్న మందిర మును పెంచి పెద్దదానినిజేసి యేడు వేల రూపాయలు దాని నిమిత్తమయి వ్యయ పెట్టితిని. ఈ పురమందిర నిర్మాఘాణములో నాకు సాయము చేసిన పయి యిరువురు మిత్రులకును ఇతరమిత్రులకును నా కృతజ్ఞతను దెలుపవలసి యున్నది. నాళము కామరాజు గారు పురమందిరము యొక్క తూర్పుభాగమున కట్టఁ బడిన పఠనమందిరము నిమిత్తమయి తమ స్థలములోనుండి ముప్పదినలువది గజముల స్థలము నుచితము"గా నిచ్చిరి; ఖాజా ఆహమదల్లాఖాన్ సాహెబు గారు కఱ్ఱలు కోయించుకొనుట మొదలయిన పనుల కుపయోగించుకొను నిమి త్తమయి తమ స్థలములో తావిచ్చిరి; మామిడి రామస్వామిగారును జూపూడి రామానుజవు గారును తాము విశేషలాభము నపేక్షీంపక యితరుల కమ్మెడుదానికంటె తక్కువ వెలలకు నాకు కొన్ని కఱ్రలిచ్చిరి; దొమ్ముగూడెపు కలప వర్తకులైన జాన్ పీటర్సను గారును కోట్ల పోతన్నగారును జోగా చిన వెంకట స్వామి గారును నాయొద్ద మూల్యముగైకొనక యొక్క రొక్కరై దేసి కఱ్ఱల నిచ్చిరి; పురమందిరము నిమిత్తమయి కావలెనన్న నెక్కువ వెల యడుగుదు రన్న -హేతువుచేత దామరాజు నాగరాజుగారి పేర కొన్న స్థలమును తనకే యుంచు