పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 స్వీ య చ రి త్ర ము

కొని దానిలో కొట్లు కట్టింపవలసిన దని బంధువులును తమ కమ్మినపక్షమున కొన్నదానికంటె నైదు రెట్ల ధన మిచ్చెద మని మిత్రులును ప్రోత్సాహపఱచినను వినక యాయన నా పేర వ్రాసియిచ్చిరి; నేను కొన్నస్థలమునకు వెనుకనున్న స్థలమును పురమందిరము నిమి త్తమయి తన పేరఁగొని బసవరాజు గవర్రాజుగారింతలోకాలధర్షము నొందగా గవర్రాజు గారిభార్య లక్షీ దేవమ్మగారు కొన్న నూటయేఁబది.మూడు రూపాయలకే నాకాస్థలము నిచ్చెను. ఈ ప్రకార ముగా నప్పడప్పడు కొనుచువచ్చిన స్థలములకయి వ్యయపడినది రు 653 80లు; మందిర నిర్జాణమునకు వ్యయపడినది రు 5149-15-8 లు; తరువాత పఠనమందిర మును బిల్లియర్డుగదిని దానితోఁజేర్చి కట్టుటకయి వ్యయపడినది రు.1989-0.0లు; మొత్తముమీద నేను పురమందిర నిర్హాణార్థము కర్చుపెట్టిన మొత్తమంతయు రు 7072.7.3 లు, ఇందు నిమిత్తము నేనితరులవలన నేమియుఁ గైకొనకుండు నట్లేర్పఱచుకొన్నను దొమ్మగూడెపు కలపవర్తకులవలన మున్నూరు రూపాయలు వెలచేయు పదు నేనుకఱ్ఱలు ధర్మార్థముగా పుచ్చుకొనవలసి వచ్చినది. పటల బంధనముల (Trusses) నిమిత్త మయి కావలసిన పొడుగయిన టేకుకర్రలు రాజమహేంద్రవరములో దొరకక పోయెను. అవి కఱ్ఱలకు జన్మస్థానమయిన బస్తరులోను దొమ్లుగూడెములోను దొరకునని తెలియవచ్చినందున, అట్టి కఱ్ఱలనుకొని పంపవలసినదని నా శిష్యులును భద్రాచలము తహశ్శీలుదారును నయిన సయ్యదువజీరుద్దీన్ సాహేబుగారి పేర వ్రాసితిని. ఈ విషయమయి కొన్నియు త్తర ప్రత్యు త్తరములు నడచిన యనంతరము నం దాయన భద్రాచలము తాలూకాలోని కూనూరునుండి 1989వ సol| ఏప్రిల్ 29వ తేదిని వ్రాసిన యుత్తరములోని కొన్ని వాక్యముల నిందు వ్రాయుచున్నాను--

“Myself and the Buster Tahsildar Mr. Chintaman Ramachander tried our best to buy some timber at Dommugudem and send them on to you. There are some logs at Dommugudem now but they say the timber can not now be taken down the river owing to the difficiency of water in the river. I herewith send you three letters to the addresses of