పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

«ЭсDs, స్వీ య చ రి త్రి ము నుంTడేను. ప్రతిపతులమాయోపాయములకు నేను లోఁబడక వారిది యీసంవత్స రమే యీ పని నిమిత్తమేర్పఱుపఁబడినదగుటచేత నిజమైన సభయే కాదనియు ఆందుచేతవారిచేసెన్నుకోబడిన ప్రతినిధులు ప్రతినిధులేకారనియు, కలిసి పని చేయనిష్టమున్నయెడల రెండుసభలవారిచేతను నెన్నుకొనఁబడిన ప్రతినిధుల నఫ్టేయుంచి యుఛయపకములవారును జేరి మఱియొకసభచేసి వీరెందఱిని కోరుదులో వారందతిని కోరి యీ కొత్త సంఖ్యను పూర్వపు సంఖ్యకు చేర్ప వచ్చుననియు, నేను జెప్పితిని. సాంఘిక వుహాసభకు చెన్నరాజధాని కార్య దర్శిని -నేనగుటచేతను, చిరకాలమునుండియుండియున్న హిందూ సంఘసం స్కార సమాజమునకు నేనధ్యకఁడనగుటచేతను, ఏ వి నిజమయిన సంస్కార సభలో నెవరుమహాసభలో మాటాడుట క ులయిన ప్రతినిధులో నిర్ణయము చేసెడియధికారము నాయందుండినది. అంతేకాక యా సంవత్సరపు మహా సభా నిబంధనలలో స్థానిక కార్యదర్ళిచేత క్రమమైన సంఘ సంస్కార సమా జముచే సెన్నుకొనబడినవారనియంగీకరింపఁబడిన ప్రతినిథులనేకాని యితరసలను మహాసభలో మాటాడనియ్యఁగూడదన్న యొకక్ర" త్త నిబంధన చేర్పఁ బడి నది. ఈ నూతన నిబంధనము తమ ప్రతినిధులను నిరాకరించు నుద్దేశముతో నా పేరణముచేత చేయఁబడినదని హిందూసమాజమువారు భావించి, దానిని మార్పవలసినదని సాంఘిక మహాసభౌ సామాన్యకార్యదర్శియైన న్యాయమూర్తి చంద్రావార్కరుగారి పేర బొంబయికి వ్రాసిరికాని వారావిన్నపమును నిర్ల యము నిమిత్తము నాయొద్దకేపంపిరి. వాశేవిధముచేతను లబ్ధమనోరథులుకాక కట్టుకట్టి తామందఱును మహాసభకు రాక నిలిచిపోయిరి. వా8లాగో దివాకా బహుదూరస ఆదినారాయణయ్యగారు మొదలైన యేకపక్షావలంబులు కానివారు కొందఱుమాత్రము సభకువచ్చిరి. ఆసంవత్సరపు సాంఘిక మహాసభ వెనుకటి సభలకం లేును నధికజయప్రదముగా జరగెను. ఈ సభ జరగిన తరువాత హిందూసమాజమువారు పురమందిరములో ఆనీ బెసెంటు దొరసానిగారి యాధి పత్యమక్రింద నొక మహాసభను చేసిరి-కాని యూ యొక్క సభతోనే యా సమాజమంతరించినది.