పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్రు క కణ ము ○○ 2 1902-వ సంవత్సరములో గుంటూరునందు ప్రథమ వితంతూద్వాహము జరిగినది. ఆ వినాహమును జరిగించి పోవలసినదని యక్కడి ప్రాడ్వివాకు లైన విశ్వనాథశాస్త్రిగారు నన్నుకోరిరి. వారికోరిక నంగీకరించి నేను భార్యాసహితముగా ఆక్టోబరు నెల 10-వ తేదికి గుంటూరు వెళ్లి విశ్వనాథశాస్త్రీ గారిలోపలనే దిగితిని. నే నక్కడికిపోఁగానే గుంటూరిలో పెద్ద సంక్షోభ మారంభమయ్యెను. విశ్వనాథశాస్త్రిగారి వంట బ్రౌపణుఁడు వారినివిడిచి లేచి పోయెను. వివాహము తమయింటజరపవలదని యాయనభార్య పట్టుపట్టెను. అంతదూరమునుండి నన్ను పిలిపించిన తరువాత నా కాశాభంగము కలిగించుట యుక్తము కాదని యాయన లోబడక దృఢచిత్తుఁడయి విలిచెసు, 1902_న సంవత్సరము ఆక్టోబరు నెల 11-వ తేదిని గుంటూరిలో ప్రథమ వితంతు వివా హము వారియింటనే నడచినది. ఈ వివాహములో వరుఁడు బేతవూడి జోగి ప్రకాశ రావు గౌరు ; వధువు రాజమహేంద్రవర నివాసినియైన శ్రీమతి వేంకటరమణవు. ఉన్నవలక్ష్మీనారాయణ గారీ వివాహములో భోజనమునకు వచ్చి యీపకమునఁజేరిరి. తరువాత గుంటూరిలోఁజేయఁబడిన శ్రీ పునర్వి వాహములన్నియు నీ లక్షీ నారాయణగారిచేతనే చేయబడినవి. మఱునాటి రాత్రి నాగౌరవార్థముగా గుంటూరు నాటక సవూజివువారు - మద్విరచితమైన శాకుంతల నాటకమును బ్రదర్శించిరి. Tন ন্য-০ তলুগু నాటకమును జూచి మఱునాఁడు బైలుదేతి యింకొక పునర్వివాహముచేయించుటకయి కుటుంబ సహితముగా రాజమహేంద్రవరమునకుఁ బోయితిని. 1902వ సంవత్సరపు అక్టోబరు నెల }4_వ తేదిని రాజమహేంద్రవరములాశ నుద్దేశింపఁబడిన వితంతు వివాహము జరగినది. ఇందు వరుఁడు రాజమహేంద్రపురవాసియు చిలకము లక్షీనరసింహముగారి పాఠశాలలో సహాయోపాధ్యాయుఁడునైన తిరుమెళ్ల వేంకటసుబ్బారావుగారు; వధువుతిరువళ్లూరు సమినాపములాగోనున్నయవిచ్చేరి గ్రామనివాసియైన తిగుమాలాచార్యులు గారి పత్రిక వేంకటలక్ష్మమ్మ. -క యూ చార్యులుగారావఱకు రెండుసంవత్సరములనుండి కొవూరితవివాహ నిమి త్తమయి నాయొద్దకువచ్చుచుండెడువారు. ఆయన మొట్టమొదట వరుఁడు వైష్ణవుఁడే