పుట:Subhadhra Kalyanamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆయుధశాలకు - నరుగంగవలసి
ధర్మనందనుడు తా - ద్రౌపతి గూడి
శూర్మితో నుండుట - గూడ గుర్తించి
ఆభూమిదేవు నుడు - లడలు ధేనువుల
క్షోభలు మాన్పంగ - జూచి ధర్మువును
అనుచు నాయుధ శాల - కరుదెంచి క్రీడి
తనువున నాయుధాల్ - తగదాల్చి పట్టి
తరమి యాముచ్చుల - దండించి పసుల
మరల నాద్విజునకు - మరియాద నొసగి
తనయన్న కడ కేగి - దండంబు వెట్టి
మును జేయనమయము - మునుకొని చెప్పి
యెలమితో దీర్థముల - కేగెద ననగ
బలికె ధర్మజు డంత - బార్థుని తోను
నను విడచి యేరీతి - చెనెదవోయన్న
కొమరొప్ప వచ్చితివి - గోవులకొరకు
సమయభంగములేదు - చనవల దనెను
మనము గావించిన - మర్యాద లన్ని
మనమె చేయకయున్న - మరి ధర్మమేది?
అనుచు ధర్ముజుచేత - ననిపించు కొనియె
యన్న పాదములకు - నతిభక్తి మ్రొక్కి