పుట:Subhadhra Kalyanamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున మీర లొ - క్కటఁ గాంత పొందు
గావింపరాదు సం - కటపాటు గదురు
ఒక్కొక్కయే డామె - యొక్కొకరినగర
మక్కువతోనున్కి - మర్యాద యగును
ఒక్కరి నగరిలో - నువిద యున్నపుడు
మక్కువ వేఱొకరు - మసల రాదచట,
ఏకాంత మరయక - యేగినవారు
వ్యాకులపడక యా - వసతి వర్జించి
తిరముగా నొకయేఁడు - తీర్థాళులందు
చరియించ వలె నని - సమయంబు చెప్పె
ఒప్పించె నారదుం - డొగి నేగె నంత
అప్పటినుండి - తా రైదుగురు రట్లె
సమయంబు పాటించి - సాధ్వితోగలసి
ప్రమదంబుతో భూమి - పాలించు చుండ్రి
ఒక్కనాడాపురిని - నొక విప్రునింట
తెక్కలి మ్రుచ్చులు - ధేనువుల్ గొనుచు
చనిరి విప్రుం డంత - సవ్యసాచికిని
మొనసి ధేనువులకై - మొఱవెట్ట దొణగె
భూసురవర్యుండు - మొఱలిడ దెలిసి
భాసురంబుగ తన - ప్రతినను తలచి
ఆయార్తరవముల - కా ధనంజయుఁడు