పుట:Subhadhra Kalyanamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

33


ఓ చెల్ల యని మతి - నాచకోరాక్షి
తడయక తలపోసి - దా నప్పు డడిగె
నెచ్చట నున్నాడో - యెలమి నర్జునుడు
తీర్థమ్ము లేవేవి - తిరుగు చున్నాడో
యేపుణ్య భూముల - కేగి యున్నాడో
వినిపిచు మనె - నామె తెకను తెల్లముగ
అని యిట్లు బలుకగా - నామునీశ్వరుడు
అమరగా బలికెను - అతివతో నపుడు
కోమలి యిద్దఱము - గోకర్ణమందు
కూడియే యుంటిమి - కొన్నాళు లచట
భోజనమ్ములు శయన - ములు నొక్క చోటె
చెలియ యంటిమి మేము - చెలి కాండ్ల వలను
అతనికి నాకును - అరమర లేదు
అతనికి నాకైక్య - మతివరో వినవె
నీరూపు నీరేఖ - నీ చక్కదనము
వేమాఱు తలపోసి - వివశుడై యుండు
నిడు రేయి పగలు కం - టికి కూర్కు లేద
యింతి నీ పై మోహ - మెనగొనియుండు
నెలమి నర్జునిని రూ - పెఱుగనే తాను
రూపేల గోరక - నోపల్లవాంగి
మందార దామమా- మాయన్న చేత