పుట:Subhadhra Kalyanamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32


నారామచిలుక ఫ - క్కున నేగు దెంచె
పసిడి రెక్కలు - సొంపు లెసగి యాడగను
మాణిక్యవుంగంఠ - మాలికల్ మెఱయ
పార్థుని భుజముల - పై నిల్చి యపుడు
నయ భయములతోను - నరున కిట్లనెను
బావ లేలెమ్మని - బడలికల్ తెలిపి
మోవి గంటిని చేసి - ముద్దులు వెట్టె
యిది మేమి విజయుడా - యీరీతి నుండ
అన్నిట గుణశాలి - వౌదువు నీవు
అర్జున నీమన - మలరు చుండగను
నిర్జరీగతి నాతి - నిన్నెతానడిగె
నెలమి దుర్యోధనున - కిచ్చెదననిన
కడు తాపమును బొంది - కాంత నిన్నడిగె
యిరువురి మనసులో - నెల్ల తాపములు
నెఱిగియు నెఱుగని - తెఱ గుండ వలెను
ఇంతిని తోడ్కొని - యింద్ర ప్రస్థమున
కెంతో వేడుకల నీ - వేగుదురు గాని
కమలాక్షి పెంచిన - కడు ముద్దు చిలుక
నడుగ వలె నా నీకు - అన్ని బుద్ధులకు
మందెమేలమ్ములకు - మఱి వేళ గాదు
అనుచు ముంజేతి కం - కణముపై వ్రాలె