పుట:Subhadhra Kalyanamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18


అత్తరి జలక మా - యత్తమ్మ జేసె
యేవేళ కా మౌని - యిష్టమ్ము లెరిగి
ఆవేళ కావించు - నఖిల వస్తువులు
పొలుపైన రత్నాల - బొమ్మరింటికిని
తళుకైన పగడాల - ద్వార బంధములు
పచ్చల తేలుపులు - పన్నారు గురుగు
లచ్చంపు దంతేఅన - నమరు బొమ్మలును
చెరుగుల యంచుల - జీని వ్రాతలును
చిరుతపప్పుళ్ళు మరి - చెంద్రకావులును
బంగార మమరించె - చెలియ సుభద్ర
బలసి సుభద్ర శో - భనము చేయగను
అరుదెంచి కవ్వడి - అతివ కిట్లనెను
ఇందు పురోహితుం - డెవారె నీకు
అందమై నట్టి ఘడి -యారమ్ము నేదె
అన్నియు నేల నీ - యాశ్రితుడ నేనె
యున్నాను నీ పెండ్లి - నొనర జేయించ
 పప్పు బూరెలు మంచి - పాయసాన్నములు
వొప్పైన బిక్ష మా - కొనరగా గద్దు
పన్నారు గురుగుల పంచ భక్ష్యములు
నెన్నిక భుజించె - నెలమితో నగుచు