పుట:Subhadhra Kalyanamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19


తెరయొద్ద నిలుచుండి - దేవేంద్రసుతుడు
నరసిజవదనతో - సరసమ్ము లాడు
భావగర్భితముగా - పలుకు మర్మములు
భావించి పతి జూచి - పరగ తమకించు
చెలియ లక్షణములు - చెప్పెద ననుచు
కలికి నొయ్యెన లేమ - కరము చేబట్టి
అక్షీణజృంభణం - బది యెంట గద్దు
అక్షయ సౌభాగ్య - మది యింట గద్దు
పద్మ రేఖలు నీకు - బాసిల్లు ననుచు
పద్మాక్షి పాదముల్ - భావించి చూచె
వియ్యమ్ము లందగా - వెలదిరో గురుతు
ముడి వడె హారముల్ - ముద్దుల గుమ్మ
చిక్కు విడిపించు నే - చేడె సుభద్ర
మక్కువ నామీద - మరువకు మనెను
వేదోక్త యుక్తిని - వింత పెండ్లిండ్లు
కావించవలె నండ్రు - ఘన శాసనమున
లాలవ దినమున - నాగ వల్లికిని
శోభనం బగు గదే - సుదతి యిద్దరకు
పానుపుటింటికి - పరగ బొమ్మలను
కడు వేక నంపుదమ - కమలాయ తాక్షి
అనుచు కందువ మాట - యతి తను బలుక