10
శ్రీ రా మా య ణ ము
ఆలస్య మేల ”న్న - హనుమంతుమాట
చాల మెచ్చుచు రామ - చంద్రుఁడిట్లనియె.
-: సుగ్రీవుని శ్రీరాముఁడు లంక పై వెడలుటకు సైన్యమాయత్తము సేయుమని చెప్పుట :-
"వినుము సుగ్రీవ ! యీ - వేళనే కదలి
చనుదము లంక భ - స్మము సేయువాఁడ !
సమరమైన సరాక్ష - సముగా సబాంధ
వముగ ససోదరా - వళిగ సపుత్ర
పౌత్రంబుగా నాదు - బాణజాలములఁ
జిత్రంబుగాఁగఁద్రుం -చెద దశాననుని 210
విసువుతో విషము ద్రా - విన వాని నమృత
రసము ప్రాణము నిల్పి - రక్షించినట్లు
అభిజిన్ముహూర్త మా - హవభూమిఁ దనకు
శుభము చేకూర్చు తే - జోలాభ మొదవు
ఉత్తరానక్షత్ర - మొప్పు మా పేర
హత్తియుండదు రేపు - హస్త పైనంబు
నీపగల్ గదలిన - నేపగల్ గెలుతు
నాపగాధిపు దాఁటి - యాపదల్ గడతు.
నీముహూర్తంబున - నేఁగిన మనకు
భూమిజ చేకూడుఁ - బోదము నేఁడు 220
చూడుము ! కనుపట్టె - శుభశకునములు
వేడుక మదిసంభ - వించె నాకిపుడు
వలకన్ను చలియించె - వలమూపు గదలె
వలనయ్యె వనఖగ - వ్రతంబు మనకు ! ”