9
యు ద్ధ కాం డ ము
లంకఁగాలిచి కొత్త - ళమ్ములు ద్రొబ్బి
కొంకక బలుఫిరం - గులు పడఁగ్రోచి 180
పూజించుఁ దోమరం - బులు నుగ్గుసేసి
రాజ గేహమును స - ర్వము రూపు చెఱచి
యమ్మవారినిఁ జూచి - యంబుధిదాఁటి
మిమ్ము సేవించితి - మిగిలినవేల !
గ్రక్కున బయనమై - కదలి యేరీతి
చక్కగా నటుల యీ - జలరాశి దాఁటి
కపులును మీరు లం - కకుఁ జేరవలయు
నపుడెరావణుమాట - హరువయ్యెననుఁడు !
ఈతారపట్టియు - నీజాంబవంతుఁ
డీతారుఁడును మైందుఁ - డీద్వివేదుండు 190
ఈనలుఁడీగజుఁ - డీ సుషేణుండు
జానకీరమణ! దాఁ - చగనేల మీకు
కోటలతో సౌధ - కూటాలితోడ
ఘోటక రథగజ - కోటులతోడ
రావణాసురునితో - రాక్షసశ్రేణి
తో వారి వెలఁదుల - తో లంకతోడ
నలత్రికూటాద్రి మీ - రానతిచ్చినను
జులకఁగాఁ బెల్ల గిం - చుక చేతనుంచి
యిపుడే తేనోపుదు ! -రినసూనుఁ గొలుచు
కపుల సామాన్యులఁ - గా నెన్న వలదు ! 200
పాళెంబులకు నెల్ల - పయనముల్ చెప్పి
వేళంబె లంక పై - విడుతురు గాక !