ఈ పుట ఆమోదించబడ్డది
119
యు ద్ధ కాం డ ము
-: శతవలి :-
వానరోత్తము లరు - వది వేల కోట్లు
తాను చేచాఁచిన - దారి మెలంగఁ
బ్రతిబలయోధుల - భంగించువాని
శతవలిఁ గనుము రా - క్షస కులాధీశ !
--: తక్కిన వానర వీరులు :-
గజగవయగవాక్ష - గంధమాదనులు 2630
భుజశౌర్యనిధులు చూ - పుల కంపుతేర
నొక్కొక్కనికిఁ గపి - యోధులు కోట్ల
లెక్కకు పదివేల - లెక్కగాఁ గూర్చి
రామకార్యార్థమై - ప్రాణంబులైనఁ
దామొల్ల మనుచు నం - దఱు నున్నవారు.
వారిఁ జూడుము నీకు - వారితో రణము
కారాదు మనునాసఁ - గల్గియుండినను.”
అను సారణుని మాట - లాలించి శుకుఁడు
దనుజనాయకునిఁ జెం - తకుఁ జేరి పలికె.
–: శుకుని వానర సైన్య వర్ణనము :-
"రావణ ! యింకఁ దీ - ఱదు నీకుఁజలము 2640
కావరంబున నెట్లు - కడతేఱఁ గలవు ?
కపివీర లున్మత్త - గజములమాడ్కి
విపులగంగాతీర - విటపంబులట్లు
పృథుహైమవత సాల - వృక్షంబులనఁగ