పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

67

వటారణ్యము, అనంతము, కుంభకోణము, అయోధ్య, ప్రయాగ, ద్వార కావతి, జింహిల, తామ్రవర్తి, కంచి, సింహాచలము 'మొదలైన యీ నూటయెనిమిది తిరుపతులయం దవతరించితి వని వింటిని. ఆ తిరపతులఁ జూచీ సేవించ సమర్ధుండఁగాను, ఇన్ని తిరుపతుల సేవాఫలంబులు నాకు నీ నీ సహాయమేగతి శ్రీ వేంకటేశ్వరా !

148

ఉభయవిభూతి నాయకా! ఉభయవిభూతులలో, నిత్యవిభూతి, మూఁడు లక్షల ముప్పది రెండు వేల యామడ దాటఁగా, నవ్వలనండజ బ్రహ్మాం' డంబు దాటఁగా నవ్వల నమరావతీ పట్టణంబు, నమరావతీ పట్టణంబు దాటగా నావల సూర్య మండలంబు, సూర్య మండలంబు దాటగా నావలఁ జంద్ర మండలంబు, చంద్ర మండలంబు దాటగా నావల నక్షత్ర మండలంబు, నక్షుత్ర మండలంబు దాటగా నావల బ్రహ్మ లోకంబు బ్రహ్మలోకంబు దాటగా నావలఁ గారణవై కుంఠంబు, కారణ వై కుంఠంబు దాటగా నావలం బ్రకృతి. ప్రకృతి దాటగా నావల విరజూనది. విరజానది దాటగా నావలఁ బరమపదంబు. పరమపదంబు దాటగా నావల నష్టాక్షరి యనెడికొలను గలదు. ఆ కొలనిలోపలఁ గమ లంబు గలదు. ఆ కమలంబులోపల నతి విస్తారమైన మంటపంబు గలదు. ఆ మంటపంబు లోపల వేయి శిరస్సులు, రెండు వేల జిహ్వలుగల యాది శేషుండు గొడుగై పానుపై యుండగా, భగవానులు పవ్వళించియుం డఁగా, శ్రీమహా దేవియు, శ్రీమహాలక్ష్మి యుఁ బాదంబులొత్తుచుండఁగాను, భగవానుల సన్నిధిని భాగవతులు తిరుకొట్టారునంబియుఁ దిరుమలనంబి యుఁ బెరియనంబియుఁ దిరుకచ్చినంబియు, మార్నూరునంబియు, శ్రీ యయిదుగురును మూఁడు వేళలఁ బసిండి పువ్వులఁ బూజసేయంగా భగ వాను లేమనుచున్నారు. నాదాసులు నిర్భయులు. నాదాసులద్వ యాధికారులు. నా దాసులు వేదాంత వేద్యులు. నా దాసుల నే నెఱుంగుట కాని నన్నెఱుంగుట కూడదు., భాగవతాపచారంబు పడ్డట్టాయెనా యాకాశంబు పగిలిన నదుకవచ్చును, భూమి పగిలినఁ బోదుఁగవచ్చును.