పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

శ్రీ వేంకటేశ్వర వచనములు

సముద్రంబు పొరలినఁ గట్టవచ్చును. కాని యిటుకూడదు. భాగవతాప చారంబు దగ్గపటలంబు, అని వేదశ్రుతులు చాటుచున్నవి. వరవరముని మంత్రంబను విత్తనంబుఁ దెచ్చి, పరమపదంబను పాదిగట్టి, చల్లఁగా నీ తిరుమంత్రంబులను పన్నీట జలకమార్చి కాలువలు దిద్ది యష్టాక్షరి యనెడి మొలక మొలపించి స్వర వేదమంత్రంబనెడి తీగఁబాఱించిన, పరిపూర్ణకటాక్షంబనెడి పువ్వుపూచి, కాయగాచి, పండుపండి, ఫల మంది, పంచసంస్కార పరుండగుట నిన్ను నే గుఱు తెఱుంగుట. "అస్మద్గురుభ్యోనమః " అనియెడి మంత్రంబుఁ బోల మంత్రంబు లేదు. 'పూర్వాచార్యులఁ బోల మణి యాచార్యులు లేరు. పరమరహస్యంబుఁ బోల మఱి రహస్యంబు లేదు. శ్రీమహావిష్ణువుఁ బోల మఱిదై వంబు లేదు. ఇట్లు నా కెఱింగింపవే శ్రీ వేంకటేశ్వరా !

149

ఆదిమధ్యాంతరహితా ! అంబుజాసనాది వంద్యా ! 'వేదవేదాంత వేద్యా!అవధారు ! దేవా ! నా విన్నప 'మొకటిక లదు. విన నవధరింపుము, అతిఘోర సంసా 'రాంధకారం బనియెడి యడవిలోపల నా యజ్ఞాన జన్మ జీవుం డనియెడి గజంబున్నది. అది యెటువలె నున్నదంటివా? ఆశామోహంబు లనియెడి గజ సమూహంబులం గూడి పంచేంద్రియ విషయ భోగాదులం దగిలి కామక్రోధంబులం జిక్కి, తాప త్రయంబులచే ముందు వెనుకలు గాన లేక యీషణత్రయం బనియెడి ఘోర వనదుర్గ గహనంబులం దగిలి రేయుంబగళ్లు మితి లేని తిమిరం బునం జిక్కి, సన్మార్గసంచారంబు గాన లేక యున్నది. అట్టి 'గజం బునుబట్టి తెచ్చుటకు నొక్క యుపాయంబు గలదు. అది యెట్లన్నను నీయనుమతియను దివ్య పాశంబున నీవిజ్ఞానం బనియెడి వెంట యేనుఁగుతోఁగూడఁ బెన వేసి నీకృపాకటాక్షంబనియెడి సూత్రంబున బంధించి యరి షడ్వర్గంబు లనియెడీ యాశాపాశంబుల నూన్చి, నీపై భక్తి యనియెడు కంబంబునంగట్టి నీనామోచ్చారణ రహస్యార్థంబని యెడి 'మేపు మేపించి నీ తిరుమంత్రం బనియెడి జలంబుఁ బెట్టింది. భవ