పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

శ్రీ వేంకటేశ్వర వచనములు


శ్రీ వేంకటేశ్వర వచనములు

కానరాని పరమపదంబున నిన్నుఁ జూడఁగోరెదరు. అది మా కెంత దుర్లభంబు ? ప్రత్యక్షం బైన మిమ్ముఁ గొలిచినఁ బరోక్షంబు మీరే యిచ్చెదరుగాక వేగిరింప నేటికి మీ రుభయవిభూతి నాయకులరు. మిమ్ము నింతశోధింప సమర్థుండనా ? మీదాస్యమే నేఁగోరం గలవాడ గాక; శ్రీ వేంక టేశ్వరా ! "

95

నరసింహా ! నేను భూలోకంబున నెనుబదినాలుగులక్షల జంతువుల గర్భం బులందు వెడలిననేమి ? నాకు నలయిక లేదు. నీవు నా కంతరా త్మవై వెను వెంటఁ దిరుగంగా నీ శ్రీపాదంబు లెంత బడ లేనోయని విచారిం చెద. అదియునుగాక మున్ను స్వర్గ నరకాదిలోకంబుల సుఖదుఃఖంబు లనుభవించెడి వేళలో నీవు నాలోనుండి నామీఁద దయ 'నేమనుచుం టివో యనీ తలంచెద. నే నుపవాసములుండి శీతోష్ణంబుల సహించి తపంబులు సేయుతఱిని నీకు బడలిక సోఁకదుగదా యని యూహించెద. నీకుఁ దిరువారాధన సేయుచో నాహ్వానంబు సేసి యారగింపుసేయు సమ యంబున నేమి చవిగాకుండునో యావేళ యెటువలె నుండునో యెఱుం గక కొంకెద. కొండంతవాని నిన్ను సూక్ష్మంబుగా జేసికొని యాత్మ లోఁ దలంపఁగా నీకుఁ గక్క సంబయ్యెడినో యని వెఱుచెద ; నా సర్వా పరాధంబులు క్షమింపవే ; శ్రీ వేంక టేశ్వరా !

96

భీమవిక్రమా ! జ్ఞానంబనియెడి శృంగారంపుఁ దోఁటలోఁ గామక్రో ధంబు లనియెడి ' వరాహంబులు రెండు గుద్దలింపుచున్నవి. శమ దమంబు లనియెడి యోదంబులు ద్రవ్వి , వానిం బడఁద్రోచెద నంటినా నా పూర్వజన్మ ప్రతి బంధంబు లనియెడి భల్లూకంబులు రెండు నందు లోనే ఘోషించుచున్నవి. నీమీది యాశాపాశంబు లనియెడు త్రాళ్ళు దీసి వానిం గట్టిత్రోయుము. తొల్లి నీవు మాయామృగంబు నేసిన వేఁటకాఁడవు గనుక విన్నవించితి. శ్రీ వేంకటేశ్వరా ! .