పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

43


మంత్రము నాయెంగిలినోర నుడువుచున్నాఁడను. గోపికలు నీవు రహస్యంబున వినోదంబులు సలిపిన సుద్దులు నావీనులను వినంగడం గెదను. ఏకాంతంబున లక్ష్మీ సమేతుండవైన నిన్ను వేళయెఱుంగక సేవింతును. కోమలంబైన నీ తిరుమేను నాకఱకుం జూపులఁజూచెదను. నీచిత్తంబు దెలియక యావాహనంబు చేసి పూజించెద; నిది యపచారమో యుపచారమో యెఱుంగ; నేమిచేసినను నీదాసులకు నేర మెంచ నిది నీగుణము. నీవు కలవని వెఱవకుండ మందెమేలమున నపరాధములు చేసెద నోర్చుకొనుము; శ్రీ వేంక టేశ్వరా !

93

విట్టలేశ్వరా ! సాహసం బెట్టిదో కాని నిన్ను నడుగ రాని ఫలంబు లడుగఁగోరెడునామనంబు, జిహ్వ నాకుందగని పదార్థంబులు నిన్న డుగ నిశ్చయింపుచున్నది. నాగుణం బభేద్యంబైన నీ మనస్సుశోధింప గడంగెడు. నాబుద్ది తెలియరాని రహస్యోద్యోగంబులు వెదకుచున్నది. 'నాహృదయంబు నందరాని పదంబులకు నాయ త్తపడుచున్నది. నా వేడుక. నావలన నీకు నయ్యెడు. భోగంబు విలోకించును. నన్ను నీవు సంత తంబునుం బాయక నానాభోగంబు లిచ్చి యుపకారంబు లెంచుకొన జేసిన మే లెఱుంగనివాఁడ నపరాధిని; ఏమనివిన్నపంబు చేసెదను ? లోక జననియైన నీ దేవిం జూచియైనను కరుణానిధివైన నిన్నుఁ జూచుకొనియై నను నన్నుం గావవే; శ్రీవేంకటేశ్వరా ! జ్ఞై

94

త్రివిక్రమా ! మీరు సాలగ్రామ చక్రపాణి దేవపూజా శ్వత్ధతులసీ సేవాగో బ్రాహ్మణవందన తీర్థస్నాన వేదపాఠ తపోయజ్ఞై కాదశీ వ్రత దాన సంకీర్తనాదుల చేతం గృతార్థులు గండని జనులకుఁ బుణ్యంబుల చూఱ లిచ్చితిరి. ఎదుటఁ గానవచ్చిన మీమూర్తుల నాశ్రయింప నేరక కొందఱు