పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

శ్రీ వేంకటేశ్వర వచనములు

దయదలంచి యకారణబంధుండవై యొక్కొక్క యుపాయంబున నన్ను నీడేర్చుకొఱకు నీమీఁదభక్తి పుట్టించితివి. నా జడత్వంబును నీ సర్వజ్ఞత్వంబును నిందులోనే చూపితివి. భళిభళీ శ్రీ వేంకటేశ్వరా!

7

మలనాభా ! మోక్షంబు గోరెడువారికి నీపై నిరంతర ధ్యానంబు గారణంబు. ఈరీతి ధ్యానంబు సేయుటకు నిర్మలంబైన మనంబు గారణంబు. నిర్మలంబైన మనంబునకుఁ బంచేంద్రియ నిగ్రహంబు గారణంబు. పంచేంద్రియనిగ్రహంబునకు శరీర శోషణంబైన తపంబు గారణంబు. తపంబునకు బాహ్యప్రపంచ విముక్తియైన వైరాగ్యంబు గారణంబు. వైరాగ్యంబునకు సంగరాహిత్యంబు గారణంబు. ఇన్ని మార్గంబులు నీ కలియుగంబున నెవ్వరికి సిద్దించును ? నీకు శరణుసొచ్చి నామంబులు పఠియించిన నీవే దయదలంచెదవుగాక. శ్రీ వేంకటేశ్వరా !

8

గోవిందా ! పుట్టిన యపుడే యేయేజాతి పక్షులకాయా విథంబులం గూఁతలువెట్ట నేర్పినవా రెవ్వరు? మృగంబులు గర్భంబులలో నుండి వెడలి తల్లులచన్నులం గుడువఁ గణంగుటెట్లు ? పశువులు కసువుమెసంగెడి చందం బెట్టిది ? నానావిధ వృక్షంబులు మొలచినయపుడు తమ తమ యాకారములు పుష్పదళములు గలిగి తతికాలం బెఱింగి చెలంగుటెట్లు ? అన్నియును నీ యాజ్ఞారూపంబులైన ప్రకృతిభావంబులె. మేమును నీ రీతినే నీకల్పితములైన దేహంబులు మోచుచున్న వారము; మానేర్పునేరములు, మాస్వభావంబులు, మాసంసారకృత్యంబులు నీ కల్పితములైన, నీ ప్రభావంబులే. మమ్ముఁ దప్పు లెంచఁ బనిలేదు. శ్రీ వేంకటేశ్వరా !

9

రమాత్మా ! ప్రపన్నుండైన యతం డా జీవితకాలంబు మీ లీలా విభూతిలో మీ కళ్యాణగుణంబు లనుభవించి భూమి పావనంబుగా