పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

4. అష్టమహిషీకల్యాణ పరమయోగివిలాసోషాపరిణ యాన్న మాచార్యచరిత్రగ్రంథకర్త.

5. అంధ్రామరుకామరవ్యాఖ్యా కావ్యప్రకాశవ్యాఖ్యా కర్త.

6. శకుంతలా పరిణయము, శ్రీ పాదరేణుమాహాత్మ్యము. ఇతనికృతులు.

ఈ తాళ్లపాకవారికి రేవణూరివారు జామాతృ వంశమువారు. రేవణూరివేంకటకవి తన శకుంతలాపరిణయమున నిట్లు చెప్పినాఁడు.

శ్రీవత్సాన్వయరేవణూరికులజుౝ శ్రీపాదరేణుప్రభా సౌవర్ణస్ఫుటకావ్యకల్పకకవిౝ సంకీర్తనాచార్యపు
త్త్రీ వంశోత్తము నందవైదిక బుధాతిప్రోక్త వృత్తిస్వయం
భావుం దిర్మలకొండయార్య సుతు శుంభద్వేంకటాభిఖ్యునిౝ.

శ్రీ వేంకటరమణకు ...... సమర్పణంబుగా సమర్పించెద నిహపరపాధనములకు నింక నేమి కొదవ యదియునుంగాక యమ్మహాదేవుండు మదీయమాతా మహవంశశిఖారత్నం బగునన్నయాచార్యునకు జామాతరుం డనిపించుకొని భ వ దీ య సంకీర్తనంబు లాలించినకర్ణంబుల నితర సంకీర్తనంబు లాలించనని ప్రతిజ్ఞఁగావించె తత్తనూజుండగు పెద్ద తిరుమలాచార్య బిడౌజునకుఁ ద్రిపురుషపర్యంతముగాఁ బ్రత్యక్షంబును, సప్తపురుషపర్యంతముగా మోక్షంబు నొసంగెదనని వరమిచ్చె; సచ్చరిత్రులగు దదీయపౌత్రులకుఁ జినతిరుమల దీక్షితాన్నయాచార్య తిరువేంగళనాధ కోనేటి తిరువేంగళనాధ వెంగళార్యులకు విచిత్రముక్తాతపత్రరత్నకిరీట ముద్రికా ప్రచండమణిమండిత మకరకుండలోత్కరాహః కరదీపికా, పాదుకాది బహూకరణంబుల గరుణించె; విశేషించియు నత్తిరువేంగళనాథుండు సంకీర్తనంబుఁ బాడిన నాడం దొడంగే నేతత్ప్రకారంబున నమ్మహామహునకుఁ బాండవ సహాయుండైన శ్రీకృష్ణ దేవునింబలె సహాయుండై.........ధన్యుడనయ్యెదనని విశ్చయించి ;” ఈ గ్రంధమును బట్టిచూడఁగా, నీవేంకటాచార్య కవి సంకీర్తనాచార్యుఁడగు నన్నమాచార్యునికి దౌహిత్రవంశములోనివాఁడని యేర్పడును.