పుట:Sinhagiri-Vachanamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

రక్తం రత్నంగా వ్రాతలో మారే, పొరబడే అవకాశమూ లేకపోలేదు. మన్నుతోకూడిన రత్నాలలోకంటే 'అరవై ఏళ్ళబట్టి రక్తంలో నానిన 'అన్న అర్థం సరైనదేకాదు సరసమైనదీని. విప్రవధలవల్ల రక్తంలోనే దోగిఉంది ఆదుడ్డు. ఇందులో మౌలికంగా రక్తప్రసక్తి కే అవకాశం ఉంది. దోగిన అన్న ధాత్వర్ధం ఇందుకే తోడ్పడుతోంది. ప్రకరణ బలంవల్లా లేఖన సంభావ్యత వల్లాధాతు సన్నికర్షవల్లా. అన్వయ సారళ్యంవల్లా, అర్ధౌచిత్య సారస్యాల వల్లా కూడా ముద్రితపాఠంకంటె లిఖిత ప్రతిపాఠమే కవిహృదయం కావచ్చుననిపిస్తోంది. 26వ వచనంలో

"శ్వపచోపి మహీపాలః అంటిరి" అనిఉంది. ఇక్కడ మహీపాల శబ్దం సంబుద్దివాచకం. విసర్గాంతంకాదు. 30వ వచనంలో

"నూటయెనుబది తిరుపతులును" అని ఉంది. ఎనుబదికాదు. "ఎనిమిది" అని ఉండాలి. ఇదేవచనంలో చివర మళ్ళీ 'నూటయెనిమిది' అనే ఉంది. 31వ వచనంలో

‘అగాధో ఆర్ధో విష్ణువనెను' అని ఉంది. ఇది బహుశః "ఆకారార్దో విష్ణుః" కావచ్చునేమో ! ముద్రిత పాఠం అనన్వితం. ఇది శ్రీ పరాశర భట్టార్యుల అష్టశ్లోకీ ప్రారంభవాక్యం. 39వ వచనంలో

'అపదోద్ధారకా' అని ఉంది. ఆపదుద్ధారకా అని ఉండాలి. 52వ వచనంలో

“సంకీర్తన నామోచ్చారణంబుచ్ఛరింప ముహూర్తము పెట్టుమనిన విప్రుడాలస్యముచేసె" ఆని ఉంది. లిఖితప్రతిలో 'విప్రుడా స్సెం చేసెను. అని ఉంది. ఆస్సెం ఆంటే హాస్యం. "హోరీ: నువ్వు సంకీర్తనం చెయ్యడ మేమిట్రా" అని యీ కుఱ్ఱవాణ్ణి ఆస్ఫేం చేసేడు, పరిహసించేడు. ముద్రిత పాఠంకంటె ఇదేబాగుంది. 58వ వచనంలో