పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

9వ అధ్యాయము.

220. ఇరువురుమిత్రులు ఒకతోటలోనికి పోయిరి. లౌకిక జ్ఞానవంతుడగు మిత్రుడు తక్షణమే అందున్న మామిడిచెట్లను లెక్కవేయుటకు మొదలుపెట్టెను. చెట్టునకు ఎన్నెన్ని కాయలుండునో, తోటమొత్తముమీద ఆదాయము ఎంతరాగలదో గణితమువేయసాగెను. వానిమిత్రుడు తోటకాపరికడకు పోయి వానితో స్నేహముచేసికొని నెమ్మదిగ ఒక్క చెట్టును సమీపించివాడు. ఆకాపరి అనుజ్ఞతో పండ్లనుకోసి తినగలిగి నన్ని తిన్నాడు. ఈయిరువురిలో బుద్ధిశాలి ఎవడు? మామిడిపండ్లుతిను! నీఆకలితీరును. చెట్లను ఆకులను లెక్కించి గణితములు వేయుటవలన లాభము ఏముండును? వ్యర్థాడంబరము చేయు పండితుడు ఈ సృష్టియొక్క కారణమును మూలమును తెలిసికొను ప్రయత్నములో వృధాగా మునిగియుండును. జ్ఞానముచే నమ్రుడగునతడు సృష్టికర్తతోడినెయ్యమునుసాధించి, వానిప్రసాదమున లభించు బ్రహ్మానందమును అనుభవించగల్గును.

221. శాస్త్రములుచదివినంతమాత్రమున భగవల్లీలలను వివరించబూనుట, కాశీనగరపు పటమును, మాత్రము చూచి కాశీనగర విశేషములను అభివర్ణించి చెప్పబూనుటవంటిదే.

222. "స రి గ మ ప ధ ని" అని ఊరక నోటితోఅనుట తేలికయే. ఆస్వరములనువీణెమీద పలికించుటకడుదుస్తరము. అటులనే ధర్మమునుగురించి మాటలాడుట తేలికయే; వానిని జీవితమున ఆచరించుట దుర్లభము.

223. తేనెటీగ పూరెబ్బలలోనికిచొఱక అందలి తేనెను రుచిచూడనంతవఱకును, అదిపూవునుచుట్టిచుట్టి యెగుఱుచు