పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

76

ఝంకారముచేయుచుండును. అది పూవులోపలదూఱి తేనెను త్రాగునప్పడు చప్పుడుచేయదు. ఎంతవఱకునరుడు శాస్త్ర విధులను, నియమములనుగురించి వివాదములుసాగించుచుండునో అంతవఱకును వానికి సత్యమగుభక్తి అలవడదు. వానికి దానిరుచి తెలిసినతోడనే అతడు వాచలతలేక శాంతిని వహించును.

224. సంతకు దూరముగానున్నప్పుడు పెద్దగోలగా శబ్దము వినవచ్చును. సంతలోప్రవేశించగానే ఆశబ్దము వినరాదు. అచ్చటజరుగుచుండు బేరసారములు తెలియవచ్చును. అటులనే భగవంతునికి దూరముగానున్నవానిని వ్యర్ధపు వాగ్వాదములు ముంచివేయును. ఆతడు భగవంతునిదగ్గఱకు చేరినంతనేయుక్తులు, ప్రయుక్తులు, వాగ్వాదములు అన్నియు పోయి విస్పష్టముగా కండ్లకుగట్టినటుల భగవల్లీలలు తెలిసిపోవును.

225. క్రాగుచున్న నేతిలో పచ్చిగారెను పడవేయగానే పెద్దధ్వనిపుట్టును. అది పచనమైనకొలదిని ధ్వనితగ్గును. బాగుగపచనమైనప్పుడు పొంగులు సమయును. మనుజుడు అల్పజ్ఞానిగనున్నంత కాలము ప్రసంగములు చేయుచు ఉపన్యాసములిచ్చుచుండును. బ్రహ్మజ్ఞానసిద్ధి అలవడగానె వ్యర్ధపు ఆడంబరములను పూర్తిగవిడచివేయును.

226. ఎవడు ఆత్మబోధములేక మంచి మాటకారియై బాగుగ బోధలుచేయగలడో వానింగూర్చి మీఅభిప్రాయ మేమి? ఆతడు తనదాపునదాచిన యితరుల ఆస్తిని దుర్వ్య