పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9వ అధ్యాయము.

మతము - పుస్తక జ్ఞానము.

217. భగవద్భక్తి, పుస్తకములను చదువుటవలన లభించునా? పంచాంగములో ఒకానొకదినమున యిరువదిదుక్కుల వాన కురియునని వ్రాయబడియున్నది. ఆపంచాంగమును మెలివేశి పిండుటవలన ఒక్కచుక్క అయినను రాదు గదా! అటులనే సద్వాక్యములు అనేకములు శాస్త్రగ్రంధములందు కలవు. వానినిచదువుటవలన ఎవరునుసద్ధర్ములుగాకాజాలరు. ఆపుస్తుకమున వర్ణింపబడిన ధర్మములను అనుచరించినగాని ఎవరికిని భగవద్భక్తి అలవడదు.

218. గీత - గీత - గీత - గీత - గీత - అని వేవేగముగ గీత అను శబ్దమును ఉచ్చరింపుము. అట్లుఉచ్ఛరింపబడిన శబ్దము కొంతసేపటికి త్యాగి - త్యాగి అని మారును. అనగా విడిచివేసినవాడు, విరాగి అని అర్ధమగును; గీతయొక్కబోధయంతయు ఒక్కమాటలోయున్నది. "త్యాగముచేయుడు; ఓజనులారా! సకలమును త్యాగముచేసి, మీహృదయములను భగవంతునిపైని హత్నించుడు." ఇదియే గీతాసారము;

219. ఒకడు ఓదేవా! ఓదేవా! అల్లాహో! అల్లాహో అని అఱచుచుండునంతకాలమును, వానికి భగవంతుని దర్శనము కాలేదనుట నిశ్చయము; ఈశ్వరుని దర్శించినవాడు మౌనమువహించి శాంతముగ నుండును.