పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

68

208. మున్ముందు భగవంతుని నీహృదయమనుకోవెలయందు ప్రతిష్ఠించుము; మొదటవానిని ప్రత్యక్షము చేసికొనుము. బ్రహ్మసాక్షాత్కారమైన అనంతరము ప్రవచనములు, ఉపన్యాసములు మొదలగువానికి కడంగవచ్చును. అంతవఱకును వలదు. ప్రాపంచికవిషయములకు బద్ధులైయుండియు కొందఱు దేవుడని బ్రహ్మమని ఏమేమొ గొడవగ పలుకుచుందురు. అందువలన ఫలమేముండును? కోవెలలో పూజచేయుటకు దేవుడులేనిదే పూజలకురమ్మని ఊరక శంఖము లూదినట్లుండును.

209. ఒకగ్రామమున పద్మలోచనుడను బాలుడుండెడివాడు. ఆయూరివారందఱును వానిని పద్దయ్య అని పిలిచెడువారు. ఆపల్లెలో పాడుపడినప్రాతగుడిఒకటి యున్నది. దానిలోపల దేవాతావిగ్రహము కూడలేదు. గుడినిండాచెట్లు చేమలు మొలచినవి. అదిగుడ్లగూబలకును, గబ్బిలములకును కాపురమై పోయినది. ఒకనాటిసాయంతనము హఠాత్తుగా ఆపాడుపడినగుడిలోనుండి జేగంటమ్రోతలు, శంఖధ్వనులు వినవచ్చినవి. పురుషులు స్త్రీలు బిడ్డలు పరుగుపరుగున అచ్చోటికి పోయిరి. ఎవరోభక్తుడుదానిలో దేవతావిగ్రహమునుప్రతిష్ఠించినాడు. హారతియివ్వబోవుచున్నాడు అనితలంచి ఉత్సాహముతోనుండిరి. వారందఱును చేతులుజోడించుకొని ఆపవిత్ర ధ్వానములనువినుచు దేవతనుచూచుటకై ఆతురతతో గుడియెదుటనిలుచుండిరి. వారిలోఒకడుసాహసించిలోన ఏమిజరుగుచున్నదో తెలిసికొననెంచితలుపుసందుగాచూచినాడు, ఆగుడి