పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

37

3వ అధ్యాయము.

119. రాజహంసము నీటితోకలిసియున్నపాలనుండి, నీటిని విడదీసి, ఆపాలనుమాత్రమే గ్రహించును; ఇతరపక్షులు అటులచేయజాలవు. ఈశ్వరుడు మాయతోకూడియున్నాడు. సామాన్యనరులు మాయనుండి వేఱుపఱచి ఈశ్వరునిగుర్తింపజాలరు. పరమహంసమాత్రము మాయను విసర్జించి శుద్ధబ్రహ్మమును గ్రహింపజాలును.

120. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వనములబడిపోవుచుండిరి. శ్రీరాముడుముందు నడచుచుండెను. సీతమధ్యను లక్ష్మణుడు చివఱనుఉండిరి. సదా శ్రీరామునితనకండ్లయెదుట నుంచుకొని చూచుచుండవలయునని లక్ష్మణునికిఅభిలాష. సీతనడుమనుండుటచేత లక్ష్మణుడు రామునిచక్కగ చూడలేకుండెను. అప్పుడతడుకొంచెము ప్రక్కకుతొలగుమని సీతను ప్రార్థించినాడు. ఆమె అటులతొలగగానే లక్ష్ముణునికోర్కె ఫలించి శ్రీరాముని కన్నులార చూడగలిగెను. ఈవిశ్వములో బ్రహ్మము మాయ జీవుడు అటులవర్తింపుచున్నారు. మాయాభ్రాంతి తొలగనంతవఱకును జీవుడు ఈశ్వరుని చూడజాలడు; నరునకు నారాయణునిదర్శనముకాదు.

121. పాముకోఱలందలి విషము పామునకు హానికరము కాదు; అది వేఱొకని కఱచునెడల ఆవిషము వానినిచంపును. అటులనే ఈశ్వరునియందలి మాయ వానికి అపాయకరము కాదు; మఱియు ఆమాయ విశ్వమునంతను భ్రాంతిపాలుచేయుచున్నది!

122. పిల్లి తనకూనలను పండ్లతోపట్టుకొనినప్పుడు ఆకూనలకు అపాయముండదు. ఆపిల్లిచుంచునుపట్టుకొనినప్పుడు చుంచు