పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

371

41వ అధ్యాయము.

నూరు శ్లోకములను ఏకరువుపెట్టుటకంటే మౌనముతాల్చుట ఈవిషయమున మహోపన్యాసము నిచ్చినట్లగును!"

977. అగ్బరు రాజ్యము చేయుచుండినకాలమున ఢిల్లీ సమీపమున నొక అడవిలో ఫకీరొకడు ఒక గుడిసెలో వసించుచుండెను. అనేకులుప్రజలు వానిని దర్శించి వచ్చుచుండిరి. కాని వారికెవరికిని తన ఔదార్యమునుచూపుటకు వానికడ నేమియులేకుండెను. వానికి ధనము కావలసివచ్చినది. అగ్బరు ఫకీరులయెడ భక్తిగలవాడను ప్రఖ్యాతియుండెగాన, ఈఫకీరు ధనసాహాయ్యముకొఱకై పాదుషాకడకుపోయెను. అగ్బరు ఆసమయమున దైవప్రార్థన సలుపుచుంటతెలిసి ఫకీరు ప్రక్కనకూర్చుండి వేచియుండెను. అగ్బరుషా తన ప్రార్థనలలో "ఓదేవా! నాకు ఇంకను సంపదనిమ్ము! ఎక్కువ బలమునుగ్రహింపుము! నారాజ్యమును విస్తరింపజేయుము!" అని వేడుకోలుసాగించినాడు తక్షణమే ఫకీరు లేచి గదివిడిచి పోనుండెను. ఇంతలో చక్రవర్తియగు అక్బరు కూర్చుండియుండుడని సైగచేసినాడు.

ప్రార్థానానంతరము పాదుషా ఫకీరుతో "మీరు నన్ను చూడవచ్చితిరే! నాతోఏమియు చెప్పకుండనే వెడలిపోవ నెంచితిరేమి?" అనెను. అంతట ఫకీరు "నేను శ్రీవారిని చూడవచ్చినపనియా - ఎందుకులెండి మిమ్మును బాధించను" అనెను. వానికేమికావలయునో తెలుపుమని అక్బరు ఒత్తిడిచేసి అడుగసాగెను. తుదకు ఫకీరు "అయ్యా! నాకడకు అనేకులు బోధకొఱకై వత్తురు. ధనములేమిచేత నేను వారిని