పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

2వ అధ్యాయము.

94. సమాధియందు పరిపూర్ణమును సాక్షాత్కారముచేసికొనినవారికిసయితము, ఇంద్రియ జ్ఞానక్షేత్రమునకు దిగివచ్చునప్పుడు సగుణబ్రహ్మమును గుర్తింపగలంత"అహం"కారము మిగిలియుండును. సప్తస్వరములలో "ని"అను స్వరమునందే సదా కంఠధ్వనిని నిలుపుట దుస్సాధ్యము కాదా? కావున సగుణమె గతమును అవసరమే.

95. "నావాదమే సరియైనది, విమర్శనకు నిలుచునది. సుస్థిరమైనది. సగుణదైవతమును విశ్వసించువారు పొఱబడువారు" అని అద్వైతి అనతగదు. బ్రహ్మముయొక్క సగుణరూపముల సత్యత ఎంతమాత్రమును తీసిపోవునది కాదు. ఈదేహముకన్నను మనస్సుకన్నను ఈదృశ్యప్రపంచకముకన్నను ఆసగుణరూపములు ఏన్నియోరెట్లు సత్యములే సుడీ!

96. బ్రహ్మమునిరాకారుడని భావనచేయుటమంచిదే. కాని ఆభావనమాత్రమే సమంజసమనియు, తదితరమంతయు దోషభూయిష్టమనియుమాత్రము తలంపబోకుము. బ్రహ్మమును ఆకారములతో గూడినవానిగభావించి ధ్యానముచేయుటయు, తుల్యముగసమంజసమే. అయినను నీవు భగవంతునిచూచి అపరోక్షానుభూతి పడయువఱకును నీవిశిష్టభావననే నిలుపుకొనియుండుము. ఆపిమ్మట సర్వమును తెలిసిపోవును.

97. అవ్యయనిర్గుణబ్రహ్మము సమాధియందుమాత్రమే గోచరించును. అప్పుడు అంతయు మౌనముదాల్చియుండును. జీవజగ