పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

30

ద్భ్రాంతులగూర్చియు, భ్రాంతిరాహిత్యముంగూర్చియు, జ్ఞానాజ్ఞానములగూర్చియు ప్రసంగములన్నియు, శూన్యములగును. కేవలసత్తామాత్రము నిలుచును. మఱేమియు నుండదు. ఉప్పుబొమ్మ సముద్రమున ఐక్యతనుపొందిన పిమ్మట ఇంకేమితెలుపును? బ్రహ్మజ్ఞానమనగాయిట్టిది!

98. సమాధిస్థితినుండి ఇంద్రియక్షేత్రమునకు దిగివచ్చినవానికి తనదివ్యచక్షువునుమాత్రము, నిలుపుకొనగలంత అహంకారము, వెడల్పులేని సన్ననిరేఖామాత్రముగ మిగులును. ఈదివ్యచక్షువు వానిని జీవజగత్తులను, ఈసమస్తరూపములుగ వ్యక్తమౌ ఎకైకసదార్ధమగు తనను చూచుకొన శక్తునిజేయును. జడసమాధియందు అనగా నిర్వికల్ప సమాధియందు నిరాకారనిర్గుణబ్రహ్మమును, మఱియు చేతనసమాధియందు అనగా సవికల్పసమాధియందు సాకార సగుణబ్రహ్మమును సాక్షాత్కారము చేసికొనినవానికి ఈభవ్యదర్శనము లభ్యముకాగలదు. నీవ్యక్తిత్వముతో గూడిన అహంకారముగలిగి నీవొకపురుషుడవైయున్నంతకాలమును, భగవంతుని ఒకపురుషునిగాతప్ప వేఱుగ నీవు భావన చేయజాలవు; ఊహింపజాలవు; సాక్షాత్కారము పడయజాలవు. అంతవరకును నిర్గుణబ్రహ్మము నీకు-భాహ్యాంతరంగములందు - మూర్తివంతుడై సగుణరూపమున ప్రత్యక్షముకాక తీరదు. ఈసగుణరూపములు సత్యతయందు కొఱవడినవికావు. ఈశరీరముకంటెను, మనస్సు