పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

24

81. మనకుభగవత్సాక్షాత్కారము అయినగాని మనముయీ అంశమునంతను అనుభవమునకు దెచ్చుకొనజాలము. తనయందు భక్తినుంచువారికొఱకై భగవంతుఁడు పలురీతులుగను, భిన్నభిన్నముగను, ఆకారములనుతాల్చి ప్రత్యక్షమగుచుండును.

బట్టలకుఅద్దకమువేయుటలో ఒకవిచిత్రపద్ధతిని అవలంబించిన రంగులపనివాడుండెను. అద్దకముకొఱకై వానిదాపునకుఎవరైనవచ్చినతోడనే, "నీబట్టకేమిరంగువేయుట నీకిష్టము?" అనిఅడిగేవాడు. ఆ వచ్చినవాడు "ఎరుపు" అనునెడల, అతడాగుడ్డను తనతొట్టెలోముంచియెత్తి "ఇదిగోనీబట్టకు ఎర్రరంగువేసితిని" అనెడివాడు. ఇంకొకడు, తనగుడ్డకు పసుపురంగునుకోరును. ఆపనివాడు దానినిగూడ అదేతొట్టిలోముంచును. దానినివెలుపలికి తీయగా అది పసుపురంగుతోనుండెడిది. అదేతీరున ఇంకొకడు వేఱురంగునుకోరుకొనునెడలను, నీలము, ఊదా, పచ్చన, మున్నగురంగులకును అదేతొట్టెను ఉపయోగించెడివాడు.

ఇదంతయుకనిపెట్టి చూచుచున్నవాడొకడు "మిత్రమా నాకేరంగునందును అభిమానములేదు. నీకు దేనియందాదరమో విచారింపకోరెదను. నీయిష్టము ననుసరించి నాబట్టకు రంగువేయించుకొందును. నీకై యేరంగువేసికొందువో ఆరంగే నాకుకావలయును." అనెను. ఇటులనే భగవంతుడు సాకారుడైగాని, నిరాకారుడైగాని భక్తుని