పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

2వ అధ్యాయము.

వడును; కాని “స్వామీ! నీవునాకు సర్వమునుఅనుగ్రహించియున్నావు" అని ఎవడనునో వానికిఏకొఱతయునుండదు.

78. భగవంతునిలో తన్మయతనుపొందుపట్ల మితిమీరునేమో యని అనుభయముండదు. మాణిక్యముయొక్క కాంతులు వెలుగునొసగి హాయినికూర్చునేగాని దహించవుసుడీ!

79. భగవానుడు ఒకానొకనితో యిటులనెను! "సరే! నీవీజీవితమున శ్రేష్టమైనభాగమునంతను సంసారమునందువ్యయముచేసి, తుదకుభగవంతుని వెదకికొనుచువచ్చినావు; భగవంతునే ముందుగ సాక్షాత్కారముచేసికొని, సంసారమున నీవు ప్రవేశించియుండినయెడల, ఆహా! ఎట్టిశాంతి ఎట్టిఆనందము నీకులభించియుండునోగదా!

80. పూరీజగన్నాధాలయములోనికి ఒకబైరాగివెళ్లినాడు. భగవంతుడు సాకారుడా, నిరాకారుడా అనివానికి సందేహముతోచినది.

అచ్చటి దేవతావిగ్రహమును చూచుపట్ల ఆవిషయమును పరీక్షింపనెంచెను. విగ్రహముకొఱకై తడవిచూచుచు తనచేతికఱ్ఱను ఎడమవైపునుండి కుడివైపునకు నడపెను. కొంతసేపు వానికేమియు కాన్పించలేదు. వాని కఱ్ఱకును ఏమియు తాకలేదు. కావున భగవంతునికి ఆకారములేదని వాడునిర్ణయించెను. ఆతడాచేతికఱ్ఱను కుడివైపునుండి యెడమవైపునకు త్రిప్పబోగా అది విగ్రహమునకుతాకినది! కాబట్టి ఆబైరాగి భగవంతుడుసాకారుడును నిరాకారుడునుకూడనై యున్నాడని నిశ్చయింపగలిగెను.