పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

308

మనకృష్ణునియెడ అపచారముచేసినట్లగును. అయ్యో! మనస్వామిఎక్కడ? పీతాంబరముకట్టి, నెమలిపింఛమునుధరించు మనపరమప్రియుడేడీ?" అని తమలో తాము గొణుగసాగిరి. ఆహా! ఈగోపికల అనన్యభక్తి ఎట్టిదో.

887. ఎటువంటివానికి విశ్వాసముకుదురునో ఎటువంటి వానికికుదరదో సూచించు శరీరచిహ్నములున్నవి. ఎముకలు కనబడునటుల బక్కిచిక్కి, గుంటలుపడిన కండ్లతో, మెల్ల చూపులుగల మనుజులవంటివారికి సులభముగ విశ్వాసము కుదురదు.

888. లౌకికవ్యవహారములు చక్క బెట్టునప్పుడు మనోశక్తి చాలవ్యర్థమైపోవును. సన్యాసమును స్వీకరించినగాని ఆనష్టమును పూరించ శక్యముకాదు.

889. తండ్రినుండి ప్రధమ జననము కలుగును. రెండవ జననము ఉపనయనకాలమున ప్రారంభమగును. సన్యాసము మూడవజననము.

890. జ్ఞాని "శివోహం; నేనుపరమాత్మను" అనును. కాని భక్తుడు "ఓహో! ఈసర్వమును ఆయన విభూతియే సుడీ!" అనును.

891. నీసాధనామార్గమేదైనను సరియే, మనస్సు సంపూర్ణముగ నిశ్చలతను పొందినగాని యోగము లభ్యముకాదు; ఇది మహారహస్యము. మనస్సు సదాయోగికి వశమైయుండు; యోగి మనస్సునకు వశుడుకాడు.