పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

307

40వ అధ్యాయము.

డును నేలపై సాగిలబడి తనకిరీటము నేలమోపి యుధిష్ఠిరునకు మ్రొక్కినాడు.

885. ప్రేమభక్తిలో రెండు ముఖ్యాంశములున్నవి. - "నేను" "నాది" అనుభావములు ("నేను" భక్తుడను; భగవంతుడు "నావాడు" అనుభావములు)

యశోద తానుతప్ప మరెవరును తన గోపాలుని శ్రద్ధగాచూడరని భావించేది; తాను పోషణ చేయనియెడల గోపాలుడు చిక్కిపోవును అనుకొనెడిది. తనకృష్ణుని భగవద్భావముతో చూచుట ఆమెకు హితవుకాదయ్యెను. భక్తుని "మమకారము" (నాదనుభావము) "భగవంతుడు నావాడు, నాస్వంతము - నా గోపాలుడు!" అనుభావమును కల్పించును. ఉద్ధవుడు యశోదను చూచి, "తల్లీ! నా కృష్ణుడు శ్రీహరిస్వామియే. ఆతడు విశ్వమునకు చింతామణి! అతడు మనుజమాత్రుడుకాడు." అనిపలికెను. ఆపలుకలువినిన యశోద "కాదు, కాదు" అటులకాదు. నేను చింతామణినిగూర్చి అడుగుటలేదు. 'నా' గోపాలుడెటులున్నడో చెప్పుము. చింతామణి పోనీ! నాగోపాలుడు!" అనెను.

866. గోపికల నిష్ఠ అద్భుతమైనది. కృష్ణుడు మధురలో నుండగా, ద్వారపాలకులను బ్రతిమాలుకొని, సభామందిరము చేరిరి. అచ్చట శ్రీకృష్ణుడు రాజవేషముతో కిరీటమునుధరించియుండగాకాంచి, నేలచూపులుచూచుచు, "ఈకిరీటధారి యెవడు? మనము వీనితోమాటాడ తగదు. అటులచేయుట