పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

306

కష్టముతో కాలువను త్రవ్వి తమ పొలములకు నీరుపెట్టుకొనవలసియుండును. నీటికొఱకై కొందఱిట్టి శ్రమనేమియు పొందనవసరములేకపోవును. వానలువచ్చి పొలములనిండ నీరునింపును. అందఱును శ్రమలుపడి సాధనలుచేసి మాయ తగిలించు సంకెళులను తప్పించుకొనవలసి యుండును. కాని కృపాసిద్ధులకీశ్రమలన్నియు నుండవు. (వారికి భగవత్కృప వలననే సిద్ధత్వము చేకూరును.) వీరి సంఖ్య అత్యల్పము!

884. గోపికలభక్తి "ప్రేమభక్తి!" ఈభక్తిని "కేవలభక్తి" అనియు "తీవ్రభక్తి" అనియుకూడ పిలుతురు. "మిశ్రభక్తి" అన నేమొ తెలియునా? భక్తితో జ్ఞానముకలిసిన యెడల దానిని మిశ్రభక్తిఅందురు. "శ్రీకృష్ణుడు సర్వమయుడు. అతడే పరబ్రహ్మము. అతడే రాముడు. అతడే శివుడు. అతడే మహాశక్తి!" అను భావనను పోలియుండును. కాని అటువంటి జ్ఞానమేమియు ప్రేమభక్తిలో మిశ్రమై యుండదు. హనుమంతుడు ద్వారకకువచ్చి తాను సీతారాములను మాత్రమే చూడనిచ్చగింతుననెను. అందువలన శ్రీకృష్ణస్వామి రుక్మిణిని సీతరూపు ధరించుమనినాడు. లేకున్న హనుమానుని సమాధానపఱచు మార్గములేదు. పాండవులు రాజసూయయాగమునుసలిపినప్పుడు, యుధిష్ఠిరుడు సింహాపీఠమున కూర్చుండ రాజులందఱును వానికి నమస్కరించిరి. ఆసమయమున విభీషణుడు తాను శ్రీకృష్ణునకుతప్ప మరెవరికిని నమస్కరించనని పట్టుపట్టెను. అప్పుడు శ్రీకృష్ణుడే యుధిష్ఠిరునికి నమస్కారము చేసెను; ఆపిమ్మట విభీషణు