పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

297

40వ అధ్యాయము.

సులభముగ వచ్చునదికాదు. నీహృదయమునుండి పూర్తిగా అహంకారమును తొలగించు కొనవలయును. "నేను కర్తను" అనుపాటి అహంకారమున్నను నీకు బ్రహ్మ సాక్షాత్కారము లభించదు. భాండాగారమున (వస్తువులుంచు గదియందు) ఎవరేని ఉన్నయెడల, ఇంటి యజమానుని ఆభాండాగారమునుండి ఏమితెచ్చిపెట్టుమని అడిగినను, "భాండాగారములో ఎవరో ఉన్నట్లున్నారు; చూడుడు. అతనిని తెచ్చియిమ్మని అడుగును. నేను అక్కడికి పోనగత్యములేదు" అనును. "నేను కర్తను" అని భావించువాని హృదయమునందు భగవంతుడు ప్రత్యక్షముకాడు.

856. భగవంతుడు తన కృపమూలమున ప్రత్యక్షమగును. ఆయన జ్ఞానసూర్యుడు. ఆయనకిరణ మొక్కటిమాత్రమే ఈప్రపంచమును తెలివితో నింపుచున్నది; దాని మూలమున మనము ఒకరినొకరు తెలిసికొనుచున్నాము. ఎన్నిరీతుల జ్ఞానమునో పొందుచున్నాము. ఆయన తన తేజమును, తనముఖముపైకి త్రిప్పుకొనినప్పుడుమాత్రమే మనము ఆయనను దర్శించగలము.

857. రక్షకభటుడు రాత్రివేళ దొంగలాంతరు చేతబట్టుకొని తిరుగుచుండును. అతనిని ఎవరును చూడలేరు. తనదీపము సాహాయ్యమున అతడు ఎల్లరను చూడగలడు; ఇతరులు కూడ దానిసహాయ్యమున ఒకరినొకరు చూచుకోగల్గుదురు. ఎవరైనను ఆభటునిచూడవలయుననిన వానితో "అయ్యా! దయచేసి నీలాంతరును నీముఖమువైపునకు త్రిప్పుకొనుము.