పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

296

శిరస్సు ఏడవస్థానము. మనస్సు అక్కడచేరినప్పుడు నరునికి సమాధికలుగును. జ్ఞానియై బ్రహ్మమును గాంచును. ఆదశయందు శరీరము చాలాకాలము నిలువదు. స్మృతియుండదు. ఏమియు తినజాలడు; నోటపాలుపోసినను అది వెలుపలికి జారిపోవును. ఈస్థితిలో నరుడు ఇరువదిఒక్క దినముండి మరణించును.

854. సమాధిని పొందిన యనంతరము సర్వకర్మలును తొలగిపోవును. బాహ్యపూజలు, జపములు మొదలగు భౌతిక కార్యములు సాగవు.

ప్రారంభమున కర్మాడంబరము విశేషముగ నుండును. ఒకడు భగవసాన్నిధ్యమును చేరుకొలదిని ఆడంబరము తగ్గుచువచ్చును. తుదకు ప్రార్థనలు భగవన్నామస్మరణయు నిలిచిపోవును.

( బ్రహ్మసమాజ ప్రముఖుడగు శివనాధశాస్త్రిగారితో నిట్లనిరి:-) మీరు సభాస్థానమునకు చేరునంతవరకు మీపేరు ప్రఖ్యాతుల గూర్చియు గుణగణముల గూర్చియు ప్రేక్షకులు చెప్పుకొనుచుందురు. మీరు రాగానే ఆప్రసంగములన్నియు ఆగిపోగలవు. ప్రతివాడును మిమ్మును చూచుటతోడనే ఆనందించును. "అడుగో శివనాధబాబు వచ్చుచున్నాడని మాత్రము పలుకుదురు. - తదితర ముచ్చటలన్నియు కట్టుపడును.

855. భగవదనుగ్రహములేనిది, నీవెంతగా ప్రయత్నముచేసినను నీకు సాక్షాత్కారము దొఱకదు. కాని భగవదను