పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

236

రుల మనస్సును పవిత్రభూతముచేసి, సద్భక్తి పూరితముగ ఘనమగుదానిగ నొనర్చుటకు చాలకాలము పట్టును; శ్రమయు అధికముగా పడవలసివచ్చును.

662. దయ్యముపూనిన మనిషిమీద మంత్రించిన ఆవాలను చల్లి ఉచ్ఛాటన చేయుదురు. కాని ఆ ఆవాలలోనె దయ్య మాసించియున్నచో వానివలనదయ్యమెటులపోగలదు? నీవు భగవధ్యానమున బెట్టు హృదయము లౌకికవాంఛలతో దుష్టమై యున్నయెడల, అట్టి క్షుద్రసాధనముతో నీధ్యాన నిష్టలను జయప్రదముగ ఎట్లు సాగించ గలవు?

663. చిలుకముదిరి, దానికంఠమందలి స్వరనాడులు గిడసబారిన తరువాత, దానికి సంగీతమునేర్పుట వలనుపడదు. అది చిన్నదిగానుండి, మెడమీది ఎఱ్ఱచాఱ కాన్పించక మునుపే దానికి గీతములు నేర్పవలసి యుండును. అటులనే ముసలితనమున భగవంతునిపైని మనసు నిలుప నేర్వవలయు ననిన సాధ్యముకాదు; చిన్నతనములో అది సుసాధ్యమగును.

664. కాల్చనిమట్టితో కుమ్మరిబొమ్మలనుతయారుచేయును; గాని కాల్చిన మట్టితో అతడేమియు చేయజాలడు; అదేవిధముగ లౌకికవ్యసనములఅగ్నిలోపడి నరుని హృదయము దగ్ధమయిన వెనుక ఉత్తమాశయములు దానినిమార్చి, ఏదేని సుందర రూపము నొసగవలయుననిన సాధ్యముకాదు.

665. ఈగ నరశరీరమందలి పుండుపైనొకప్పుడు వ్రాలును; మరలదేవుని కర్పణచేయు నైవేద్యముపైని వ్రాలును. అట్లే