పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

235

35వ అధ్యాయము.

మనుజుడు అజ్ఞానదశలో మరణించెనేని ఆతడు మరల జన్మనెత్తును; కాని అతడు బ్రహ్మజ్ఞానాగ్నియందు తప్తుడై సిద్ధత్వమును పొంది మరణించుచో తిరిగి జన్మకు రాడు.

660. ప్రశ్న:- లోకచింతగల మనుజుని పోలిక యెట్లుండును?

జవాబు:- ముంగిసల పెంచువాని కుండలోని ముంగిసను పోలియుండును. ముంగిసలపెంచువాడు గోడలో ఎత్తుగా ఒక కుండను పెట్టును. త్రాడు నొకదానిని తెచ్చి ఒక కొసను ఒదులుగా ముంగిసమెడకు తగిలించును; రెండవ కొసకు బరువు నొకదానిని కట్టును. ముంగిస కుండలోనుండి వెలువడి గోడదిగివచ్చి ఇటునటు తిరుగులాడును. ఏదేని భయము తోచగానె చఱచఱ పైకిపోయి కుండలోదూరి దాగికొనును. కాని పాపము, త్రాడునకు రెండవ కొనను కట్టియున్న బరువు, దానిని సుఖముగా ఆకుండలో కూర్చుండ నీక క్రిందికి లాగుచుండును. అటులనే లోకవ్యావృత్తుల మునింగియుండు జనుడు జీవనపు కష్టనష్టములచే బాధితుడై అప్పుడప్పుడు ప్రపంచమునకు అతీతముగపోయి భగవంతుని శరణు చొచ్చును. కాని పాపము, లౌకిక వ్యవహారభారమును అందలి వ్యసనములును, వానిని మరల మరల ఇహలోక దుఃఖములలోనికి పడలాగుచునేయుండును.

661. రెట్టింపు నీటితో కలిపిన పాలను (గడ్డగట్టిన) క్షీరముగా మార్చుటకు చాలకాలము పట్టును; శ్రమయు కలుగును. దుష్ట పాపచింతలనెడు ముఱికినీటితో పలుచబడిన సంసా