పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

228

దొంగను చేయుదురను భయములేకుండ యిష్టము వచ్చినటుల తిరుగాడు చందమున, భగవంతుని పాపముల స్పృశించిన వాడు సంసారమను వినోదక్షేత్రమున నిర్భయముగ తిరుగగలడు. వానికి సంసార తాపత్రయముల చిక్కు లేదు; ఎదియు వానిని బంధించునది యుండదు.

645. తాంత్రికుడు, మృతునిఆత్మ సాహాయమున దేవతను ప్రత్యక్షము చేసికొను సాధనచేయుచో, అతడు క్రొత్తపీనుగు మీద కూర్చుండి దాపున అన్నమును కల్లును ఉంచునట. ఉపాసనా సమయమున, ఆపీనుగకు తాత్కాలికముగ ప్రాణమువచ్చి, ఎప్పుడైన నోరుతెరచిన యెడల, ఆసాధకుడు కనిపెట్టి, ఆపీనుగునం దప్పుడావేశించిన భూతమును తృప్తిపరచుటకై, కల్లును ఆపీనుగ నోటిలోపోసి, అన్నమును నోటకూరునని చెప్పుదురు. ఆతడు అటులచేయని యెడల ఆభూతము వాని ఉపవాసమును భంగపఱచి దేవతా ప్రసన్నము కాకుండ అడ్డపడునట. అటులనే ఈసంసారము పీనుగుపైని వసించుచు, బ్రహ్మానందపదవిని పొందగోరుదువేని, సంసారమున నిన్ను బాధించు వారిని తృప్తిపఱచుటకవసరములగు వస్తువులను ముందుగ సంపాదించి పెట్టుకొనుము; లేదా నీభక్తి సాధనలకు అడ్డుదగిలి, జీవన తాపత్రయములు నిన్ను చీకాకు పఱచును.

646. వీధిలో బిచ్చమెత్తుకొనుచు తిరుగు పాటగాడు తాంబురను ఒక చేతితోమీటుచు, చిఱతను ఒక చేతితో వాయించుచు, నోటితోకూడ కీర్తనలు పాడుచుండును గదా!