పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

227

34వ అధ్యాయము.

మును మరలమరల నీమనస్సున మననము చేయవలయును. నీవు "నావారు, నావారు"అనుకొను వారందఱును యెప్పుడో యొకప్పుడు నిన్ను విడువవలసినవారే యనుట నిశ్చయమని తెలియుము. భగవంతుడొక్కడేనీవాడు! నీసర్వస్వమును ఆయనయే. వానిని నీవానిగ జేసికొనుట యెట్లాయను చింత ఒక్కటియే నీకుండదగినది.

642. నీపరిస్థితులు పాపపుప్రేరణలు గలచోటునకు బలాత్కారముగ నిన్ను తోడ్కొనిపోయినయెడల, నీదివ్యజనని స్మరణను నీతోడతీసికొనిపొమ్ము. నీమనస్సున సయితము దాగియుండు దుష్టచింతలనుండి ఆమె నిన్ను కాపాడగలదు. ఆజనని యెదుటనుండెనేని, దుష్కార్యములును, దుశ్చింతలును నీదరిరాసిగ్గుపడి పారిపోవును.

643. నీచేతులకు ముందుగా చమురురాచుకొని, పనసపండును ఒలచినయెడల, ఆపండుయొక్క జిగటరసము నీచేతులకు అంటుకొని నిన్ను తిప్పలు పెట్టదు. ముందుగా నీవు పరమాత్మజ్ఞానమను రక్షపూనుకొంటివా, సంపదల మధ్యను, సంసారమునడుమను నీవు జీవించినను, అవి నిన్నెంతమాత్రమును బాధించవు సుమీ!

644. దాగుడుమూతలాటయందు ఒక ఆటగాడు తల్లిని తాకినయెడల, తఱుముకొనివచ్చువాడు వీనిని దొంగచేయ జాలడు. అటులనే ఒక్కసారిమనము భగవత్సాన్నిధ్యమును పొందితిమా సంసారబంధములు మనను ఇంక బాధింపవు. తల్లినితాకిన ఆటగాడు తనను తఱిమి